భారత అమ్ములపొదిలో మరో మిస్సెల్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

మోదీ రెండో సారి అధికారం చేపట్టాక భారత ఆయుధ సంపత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి అధికారం చేపట్టాక.. రాఫేల్ యుద్ధవిమానాల ఆర్డర్.. ఆ తర్వాత పవర్ ఫుల్ హ్యాండ్ గ్రానైడ్ ఆర్డర్, ఆ తర్వాత.. స్పైస్ 2000 బంకర్ బ్లాస్ట్ బాంబర్లు. ఇవన్నీ విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు. అంతేకాదు.. దేశీయంగా కూడా వాయుసేనను పటిష్టం చేస్తూ.. యుద్ధ విమానాలను కూల్చే క్షిపణులను తయారీకి భారత రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. […]

భారత అమ్ములపొదిలో మరో మిస్సెల్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2019 | 2:02 AM

మోదీ రెండో సారి అధికారం చేపట్టాక భారత ఆయుధ సంపత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి అధికారం చేపట్టాక.. రాఫేల్ యుద్ధవిమానాల ఆర్డర్.. ఆ తర్వాత పవర్ ఫుల్ హ్యాండ్ గ్రానైడ్ ఆర్డర్, ఆ తర్వాత.. స్పైస్ 2000 బంకర్ బ్లాస్ట్ బాంబర్లు. ఇవన్నీ విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు. అంతేకాదు.. దేశీయంగా కూడా వాయుసేనను పటిష్టం చేస్తూ.. యుద్ధ విమానాలను కూల్చే క్షిపణులను తయారీకి భారత రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల సహకారంతో డీఆర్డీవో “అస్త్ర” క్షిపణులను తయారు చేసింది. ఇవి గగన తలం నుంచి గగన తలం టార్గెట్‌లను చేధిస్తుంది. ఇప్పటికే వాయుసేన పలు క్షిపణి ప్రయోగాలు చేసి విజవంతమైంది. ఈ నేపథ్యంలో తాజాగా వాయుసేన మరో క్షిపణి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది. ఎయిర్‌-టు-ఎయిర్‌ క్షిపణి అయిన “అస్త్ర” పరీక్షను మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ “అస్త్ర” క్షిపణి సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానానికి అమర్చి.. గగనతలంలో పరీక్ష నిర్వహించినట్లు భారత రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ “అస్త్ర” క్షిపణి ప్రయోగానికి ఒడిశా తీర ప్రాంతం వేదికైంది. గగన తలంలో నిర్దేశిత లక్ష్యం దిశగా భారత తొలి ఎయిర్‌-టు-ఎయిర్‌ “అస్త్ర” క్షిపణి దూసుకెళ్లినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. దీని పరిధి 70 కిలోమీటర్లని.. క్షిపణి లక్ష్యం దిశగా దూసుకుపోతున్న తీరును వివిధ రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ఈఓటీఎస్‌), సెన్సార్లు గుర్తించాయని తెలిపింది. “అస్త్ర” క్షిపణి పరీక్ష విజయవంతం పట్ల.. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. క్షిపణినిని తయారు చేసిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)కు అభినందనలు తెలిపారు.

“అస్త్ర” క్షిపణి స్పెషాలిటీస్..

* ఇది పూర్తి స్వదేశీయం పరిజ్ఞానంతో తయారు చేసిన ఎయిర్ టూ ఎయిర్ మిస్సెల్ * దీని లక్ష్య పరిధి 70 కిలోమీటర్లు * గగన తలంలో ఉన్న టార్గెట్లను గగన తలం నుంచే ప్రయోగించే సత్తా దీని సొంతం * ఈ క్షిపణిని దేశంలోని పలు విశ్వవిద్యాలయాల సహకారంతో డీఆర్డీవో రూపొందించింది * గంటకు 5,555 కిలోమీటర్ల వేగంతో టార్గెట్‌ దిశగా దూసుకెళ్లే సత్తా దీని సొంతం * ఈ క్షిపణిలో అత్యధిక 15కిలోల అత్యంత శక్తివంతమైన వార్‌ హెడ్‌ ఉంటుంది

అయితే “అస్త్ర” క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలకు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మార్పులను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) చేసింది.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..