India Corona: భారీగా పెరుగుతున్న కరోనా కేసులకు బ్రేక్.. గత 24 గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. రోజూవారీ

India Corona: భారీగా పెరుగుతున్న కరోనా కేసులకు బ్రేక్.. గత 24 గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే..?
Follow us

|

Updated on: Jan 18, 2022 | 10:10 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య రెండు లక్షల మార్క్ దాటి రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో (సోమవారం) భారీగా నమోదవుతున్న కేసులకు కాస్త బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా 2,38,018 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 310 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే.. కేసులు మరణాలు కాస్త తగ్గాయి. 20,071 కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం 19.65 శాతం నుంచి 14.43 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 17,36,628 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 1,57,421 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,54,947,882 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 94 శాతంగా ఉంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోల్చుకుంటే.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8.31 శాతం పెరిగింది.

కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 158.04 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 80 లక్షల డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్‌

Amazon, Flipkart: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లు.. పలు ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!