India Post: ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఇండియా పోస్ట్.. ఇకపై ఖాతాలో కనీస సొమ్ము నిల్వ లేకుంటే..

బ్యాంకులపై నమ్మకం పోతున్న వేళ.. ప్రజలంతా ఇండియా పోస్టుపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది.

India Post: ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఇండియా పోస్ట్.. ఇకపై ఖాతాలో కనీస సొమ్ము నిల్వ లేకుంటే..
Follow us

|

Updated on: Dec 11, 2020 | 10:00 PM

బ్యాంకులపై నమ్మకం పోతున్న వేళ.. ప్రజలంతా ఇండియా పోస్టుపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో కనీస నిల్వ ఉంచాలని ఆంక్షలు పెట్టింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీసం నిల్వ రూ.500 ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో సూచించింంది. ఒకవేళ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస నిల్వ అయిన రూ.500 కంటే తక్కువ ఉన్నట్లయితే రూ.100 ఫైన్‌తో పాటు జీఎస్టీని విధించడం జరుగుతుందని ఇండియా పోస్ట్ స్పష్టం చేసింది. అంతేకాదు.. ఖాతాలో నగదు నిల్వలు సున్నా ఉంటే మాత్రం ఆ ఖాతాను మూసివేయడం జరుగుతుందని ప్రకటించింది. ఈ విధానం శుక్రవారం నుండే అమల్లోకి రానుందని తెలిపింది.