ఇక రెడీ ! చైనా వైమానిక స్థావరాల దిశగా భారత యుధ్ధ విమానాలు !

చైనా కవ్వింపు చర్యలకు దీటైన సమాధానం ఇవ్వడానికి భారత్ సిధ్దపడింది. ఆ దేశ వైమానిక స్థావరాల దిశగా తన జెట్, సుఖోయ్, మిగ్-29 ఫైటర్లను ముందుకు కదిలించింది. ఈ విమానాల శ్రేణిలో జాగ్వార్ ఫైటర్లు సైతం ఉన్నాయి. ఇంతేకాదు..

ఇక రెడీ ! చైనా వైమానిక స్థావరాల దిశగా భారత యుధ్ధ విమానాలు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 20, 2020 | 2:06 PM

చైనా కవ్వింపు చర్యలకు దీటైన సమాధానం ఇవ్వడానికి భారత్ సిధ్దపడింది. ఆ దేశ వైమానిక స్థావరాల దిశగా తన జెట్, సుఖోయ్, మిగ్-29 ఫైటర్లను ముందుకు కదిలించింది. ఈ విమానాల శ్రేణిలో జాగ్వార్ ఫైటర్లు సైతం ఉన్నాయి. ఇంతేకాదు.. యుధ్ధ ట్యాంక్ లను నాశనం చేయగల అపాచీ హెలికాఫ్టర్లు, చినూక్ కాప్టర్లు సైతం సన్నద్ధంగా ఉన్నాయి. ఆకాశం నుంచి భూతలంపై గల మిసైళ్లు, రాకెట్లను పేల్చివేయగల ‘హెల్ ఫైర్ వ్యవస్థలు’ వీటిలో ఉన్నాయి. ముఖ్యంగా చినూక్ హెలికాఫ్టర్లు ఎత్తయిన ప్రాంతాలకు సైతం సైనికులను, హొవిట్జర్లను తీసుకుపోగలవు. మన 20 మంది సైనికులను క్రూరంగా పొట్టన బెట్టుకోవడం ద్వారా భారత  రెడ్ లైన్స్ ని చైనా క్రాస్ చేసిందని, ఇప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉన్నామని ఉన్నత సైనికాధికారి ఒకరు తెలిపారు. వాయుసేన సన్నద్ధతను చీఫ్ భదౌరియా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

ఇక చండీగఢ్ నుంచి లదాఖ్ వరకు సైనికులను, ఆయుధాలను తీసుకువెళ్లగల అధునాతన మిలిటరీ  శకటాలను ఓ ‘ఎయిర్ బ్రిడ్జి’ గా మోహరించారు. చైనాతో  బోర్డర్స్ వద్ద గల తన అన్ని వైమానిక స్థావరాలను భారత సైన్యం యాక్టివేట్ చేసింది. లేహ్, శ్రీనగర్, అవంతిపూర్, ఇంకా బేరైలీ నుంచి తేజ్ పూర్ వరకు సైనిక ‘సంపత్తి’ ముందుకు కదలనుంది. మరోవైపు..చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. వాస్తవాధీన రేఖ వద్ద 3,488 కి.మీ. పొడవునా తన దళాలను మోహరిస్తోంది. పాంగాంగ్ సో సమీపాన ఆ దేశం కొత్త నిర్మాణాలు చేపట్టింది. టెంట్లను ఏర్పాటు చేస్తోంది. గాల్వన్, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో చైనా ఫైటర్, బాంబర్ యుధ్ధ విమానాల సంఖ్యను పెంచినట్టు సైనికవర్గాలు వెల్లడించాయి. టిబెట్ లోని హాటన్, కష్గర్ ఎయిర్ బేస్ ల వద్ద ఇవి కనిపిస్తున్నాయి. మరోవైపు. బంగాళాఖాతంలో ఇండియా తన అదనపు యుధ్ధ నౌకలను సర్వ సిధ్ధంగా ఉంచింది. లదాఖ్,  టిబెట్, హల్వారా, సిర్సా , అంబాలా ఎయిర్ బేస్ ల వద్ద భారత ఫైటర్ విమానాలు గస్తీ తిరుగుతున్నాయి.

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..