వస్తున్నాయ్ శక్తిమంతమైన రఫేల్ యుధ్ధ విమానాలు

జులై మాసాంతానికి ఇండియాకు ఆరు శక్తిమంతమైన రఫేల్ యుధ్ధ విమానాలు అందనున్నాయి. లాంగ్ రేంజ్ 'మెటియోర్' ఎయిర్ టు ఎయిర్ (గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే) మిసైళ్ళతో కూడిన ఈ విమానాలు..

వస్తున్నాయ్ శక్తిమంతమైన రఫేల్ యుధ్ధ విమానాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2020 | 7:58 PM

జులై మాసాంతానికి ఇండియాకు ఆరు శక్తిమంతమైన రఫేల్ యుధ్ధ విమానాలు అందనున్నాయి. లాంగ్ రేంజ్ ‘మెటియోర్’ ఎయిర్ టు ఎయిర్ (గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే) మిసైళ్ళతో కూడిన ఈ విమానాలు భారత వైమానిక దళ సామర్త్యాన్ని మరింత పెంచనున్నాయి. ఇవి 150 కి.మీ. దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలవని అంటున్నారు. ప్రస్తుతం భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రఫేల్ విమానాలు  ఇండియాకు అందనుండడం విశేషం. వీటిని నడిపేందుకు భారత పైలట్లు కొందరు మాస్కోలో శిక్షణ పొందుతున్నారు. అదే సమయంలో ట్విన్ సీటర్ వెర్షన్స్ కోసం మరికొందరు అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ట్రయినింగ్ తీసుకుంటున్నారు. ఫ్రాన్స్ నుంచి ఈ విమానాలు ఇక్కడికి చేరడానికి పది గంటల సమయం పడుతుంది. అందువల్ల పైలట్లకు స్ట్రెస్ కలగకుండా మధ్య ప్రాచ్య దేశాల్లో ఈ విమానాలను కొద్దిసేపు ఆపుతారని తెలుస్తోంది.