కరోనా క్రైసిస్.. అంతర్జాతీయ దర్యాప్తులో చేతులు కలిపిన ఇండియా

కరోనా వైరస్ క్రైసిస్, దీన్ని   ప్రపంచ ఆరోగ్య సంస్థ 'హాండిల్' చేస్తున్న తీరుపై నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర దర్యాప్తునకు 62 దేశాలు సమాయత్తమయ్యాయి. ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ చొరవతో చేపడుతున్న ఈ దర్యాప్తులో చేతులు కలిపేందుకు...

కరోనా క్రైసిస్.. అంతర్జాతీయ దర్యాప్తులో చేతులు కలిపిన ఇండియా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 18, 2020 | 11:41 AM

కరోనా వైరస్ క్రైసిస్, దీన్ని   ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘హాండిల్’ చేస్తున్న తీరుపై నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర దర్యాప్తునకు 62 దేశాలు సమాయత్తమయ్యాయి. ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ చొరవతో చేపడుతున్న ఈ దర్యాప్తులో చేతులు కలిపేందుకు ఇండియా కూడా అంగీకరించింది. 73 వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం సోమవారం నుంచి జెనీవాలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ దర్యాప్తునకు సంబంధించిన ముసాయిదా తీర్మానాన్ని రూపొందించారు. ‘ఇంపార్షియల్, ఇండిపెండెంట్, కాంప్రెహెన్సివ్ ప్రోబ్ (ఇన్వెస్టిగేషన్) పేరిట ఈ తీర్మానాన్ని వ్యవహరిస్తున్నారు. ఈ పాండమిక్ అదుపునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతున్నదీ, చేపట్టాలనుకుంటున్నదీ తదితర అన్ని అంశాలపైనా ఈ దర్యాప్తు సాగుతుందని అంటున్నారు. కరోనా ఔట్ బ్రేక్ పై దర్యాప్తు జరగాలని గత నెలలో ఆస్ట్రేలియా దేశమే మొదటిసారిగా డిమాండ్ చేసింది. ఒక దశలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇలాగే డిమాండ్ చేసిన విషయం గమనార్హం. కాగా ఈ ముసాయిదా తీర్మానంలో చైనా దేశాన్ని గానీ , వూహాన్ సిటీని గానీ పేర్కొనలేదు. యూరోపియన్ యూనియన్ మద్దతుతో రూపొందించిన ఈ ముసాయిదా తీర్మానంపై జపాన్, బ్రిటన్, న్యూజిలాండ్, సౌత్ కొరియా, బ్రెజిల్, కెనడా దేశాలతో సహా పలు దేశాలు సంతకాలు చేశాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?