India Corona Updates: భారత్‌లో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

India Corona Updates: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య (Coronavirus) భారీగా తగ్గుతూ వస్తోంది. నిన్న కేసుల..

India Corona Updates: భారత్‌లో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
Follow us

|

Updated on: Feb 19, 2022 | 9:46 AM

India Corona Updates: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య (Coronavirus) భారీగా తగ్గుతూ వస్తోంది. నిన్న కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గురువారం దేశవ్యాప్తంగా 25,920 కరోనా కేసులు నమోదు అయితే తాజాగా మరింత తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,270 మంది కరోనా బారిన పడగా, 325 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చుకుంటే.. తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.8 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో 2,53,739 కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,02,505 ఉండగా, మరణాల సంఖ్య 5,11,230కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ సంఖ్య 175.03 కోట్లకు చేరినట్లు కేంద్రం వెల్లడించింది.

అత్యధికంగా కేరళలో 7,780 కేసులు నమోదైన మొదటి ఐదు రాష్ట్రాలు, 2,068 కేసులతో మహారాష్ట్ర ఉండగా, కేరళలో 1,333 కేసులు, కర్ణాటక, 1,233 కేసులు, రాజస్థాన్, మిజోరంలలో 1,151 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి కనీసం 60.92 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో రికవరీ రేటు ఇప్పుడు 98.21 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 60,298 మంది రోగులు కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,20,37,536కి చేరుకుంది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 38,353 తగ్గాయి. గత 24 గంటల్లో మొత్తం 12,54,893 నమూనాలను పరీక్షించారు.

ఇవి కూడా చదవండి:

PM Modi: ఎన్నికలకు ముందు సిక్కులతో ప్రధాని మోడీ సమావేశం.. వ్యూహం ఫలించేనా..?

Bird flu: బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాది కోళ్లను చంపేయాలని అధికారుల నిర్ణయం