సరిహద్దుల్లో ఉద్రిక్త,త, చైనాతో క్షీణిస్తున్న సంబంధాలు, ఎస్.జైశంకర్

లడాఖ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత ఇండో-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోందనివిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. అక్కడ శాంతి, సుస్థిరత నెలకొనేలా చూడాల్సి ఉందన్నారు.

సరిహద్దుల్లో ఉద్రిక్త,త,  చైనాతో క్షీణిస్తున్న సంబంధాలు, ఎస్.జైశంకర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 17, 2020 | 8:07 PM

లడాఖ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత ఇండో-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోందనివిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. అక్కడ శాంతి, సుస్థిరత నెలకొనేలా చూడాల్సి ఉందన్నారు. చైనాతో వివిధ స్థాయుల్లో చర్చలు జరుగుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావడంలేదని అయన అభిప్రాయపడ్డారు. ఫింగర్ ఏరియా ఆ సమీప ప్రాంతాల్లో చైనా దళాలు ఇంకా అలాగే ఉన్నాయని, వెనక్కి వెళ్లలేదని ఆయన తెలిపారు. అయితే భారత దళాలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాయని జైశంకర్ చెప్పారు.  సాధ్యమైనంత త్వరగా సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు మనవంతు ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం అని అన్నారు.