బ్రేకింగ్.. చైనా తీరును ఖండించని వామపక్ష పార్టీలు

సోమవారం నాడు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా దేశాల జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు.

బ్రేకింగ్.. చైనా తీరును ఖండించని వామపక్ష పార్టీలు

సోమవారం నాడు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా దేశాల జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనలో కల్నల్‌ స్థాయి అధికారి కూడా వీరమరణం పొందారు. డ్రాగన్‌ కంట్రీ పక్కా ప్లాన్ వేసి.. మన జవాన్లపై దాడి చేసిందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. మరోవైపు చైనా జవాన్లు కూడా 30 మంది మరణించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ప్రధాని మోదీ శుక్రవారం నాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీలు ఈ ఘటనపై స్పందించాయి. పంచశీల సూత్రాలను భారత్‌ గౌరవించాలని సీపీఎం నేత సీతారాం ఏచూరీ అన్నారు. ఇక మరో నేత డీ. రాజా.. భారత్‌ను అమెరికా తమ కూటమిలో చేర్చుకునేందుకు వలేసిందంటూ ఆరోపించారు. అమెరికా ట్రాప్‌లో భారత్‌ పడకుండా జాగ్రత్త పడాలని అన్నారు. అయితే ఈ
ఇరువురు వామపక్ష నేతలు చైనా తీరును మాత్రం ఖండిచంలేదని తెలుస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu