కేంద్రం నిర్ణయానికి ఆప్ మద్దతు.. కేజ్రీవాల్ ట్వీట్

దశాబ్దాల తరబడి సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్ విషయంలో స్వయం ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి తాము మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఇకనుంచైనా జమ్మూ కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్రంతో , ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మాట్లాడే కేజ్రీవాల్.. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ విధంగా కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించడం చర్చనీయాంశంగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:21 pm, Mon, 5 August 19
కేంద్రం నిర్ణయానికి  ఆప్ మద్దతు..  కేజ్రీవాల్ ట్వీట్

దశాబ్దాల తరబడి సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్ విషయంలో స్వయం ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి తాము మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఇకనుంచైనా జమ్మూ కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కేంద్రంతో , ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మాట్లాడే కేజ్రీవాల్.. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ విధంగా కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించడం చర్చనీయాంశంగా మారింది.