మర్కజ్ నిజాముద్దీన్ వ్యవహారం.. అజ్ఞాతంలో ఉన్న మౌలానా ఏం చెప్పాడంటే ?

దేశంలో పెరిగిపోతున్నకరోనా కేసులకు, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ మసీదు గేదరింగ్స్ (ముస్లిముల ప్రార్థనా సమావేశాలు) కి మధ్య లింక్ ఉందన్న కీలక విషయం బయటపడడంతో అసలు ఈ తతంగానికంతా మూల పురుషుడు

  • Publish Date - 1:39 pm, Thu, 2 April 20 Edited By: Anil kumar poka
మర్కజ్ నిజాముద్దీన్ వ్యవహారం.. అజ్ఞాతంలో ఉన్న మౌలానా ఏం చెప్పాడంటే ?

దేశంలో పెరిగిపోతున్నకరోనా కేసులకు, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ మసీదు గేదరింగ్స్ (ముస్లిముల ప్రార్థనా సమావేశాలు) కి మధ్య లింక్ ఉందన్న కీలక విషయం బయటపడడంతో అసలు ఈ తతంగానికంతా మూల పురుషుడు.. లేదా సూత్రధారి అయిన మౌలానా ఎక్కడ ఉన్నాడన్నది మిస్టరీగా మారింది. ఈ మసీదులో పెద్ద సంఖ్యలో మతపరమైన కార్యక్రమాలకు హాజరైన అనేకమందికి కరోనా పాజిటివ్ ఉందని,  ఆయా కార్యక్రమాలు ముగిసిన అనంతరం వీరిలో చాలామంది ఎవరికి వారు గప్ చుప్ గా ఎవరి రాష్ట్రాలకు వెళ్లిపోయారని వఛ్చిన వార్తలు దేశంలో సంచలనం రేకెత్తించాయి. దీంతో  ఇస్లామిక్ తెగ తబ్లీఘీ జమాత్ చీఫ్ అయిన 56 ఏళ్ళ మౌలానా సాద్ కంధాల్వీ జాడ తెలియకుండా పోయింది. ఆయనకోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఆయనకు కూడా కరోనా వైరస్ సోకి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ మౌలానా కోసం ఢిల్లీ క్రైమ్ బ్రాంచి పోలీసులు ఢిల్లీతో బాటు యూపీ లోని ముజఫర్ నగర్ కి కూడా ప్రత్యేక బృందాలను పంపారు.  మరో ఆరుగురు మర్కజ్ అధికారుల కోసం కూడా వేట ప్రారంభించారు.  కంధాల్వీ  ఆచూకీ కనుగొనేందుకు  ఢిల్లీ నగరంలోని 14 ఆసుపత్రులను వారు కాంటాక్ట్ చేసినట్టు తెలిసింది.

కాగా-ఓ డాక్టర్ సలహాపై తాను కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని మౌలానా రెండు ఆడియో క్లిప్స్ లో తెలిపాడు. మర్కజ్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో.. ‘మరణించడానికి మసీదే మంచి ప్రాంతమని’, నా సహచరులను కరోనా వైరస్ ఏమీ చేయజాలదని ఆయన పేర్కొన్నాడు. తన తెగ లోని సభ్యులంతా క్వారంటైన్ లో ఉండాలని, అది ఇస్లాంకు గానీ, షరియత్ కు గానీ వ్యతిరేకంగానీ  కాదని తెలిపాడు. సామాజిక దూరం ఆంక్షలను పట్టించుకోకుండా అంతా ఈ మసీదులో గుమికూడాలని కూడా మౌలానా పిలుపునిచ్చాడు. అసలు మసీదును ఖాళీ చేయవలసిందిగా పోలీసులు జారీ చేసిన రెండు నోటీసులను మౌలానా పట్టించుకోలేదు.

‘అటు-ఈ సామాజిక దూరం ఆంక్షలు  ముస్లిములను ఒకరికొకరు దూరం చేయడానికి పన్నిన కుట్రే తప్ప మరేమీ కాదని మార్చి 23 న చేసిన  ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నాడు. ‘ఇది అంతా కలిసి కూర్చోవల్సిన సమయం..అంతేగానీ..   ఒకరినొకరు ఎవాయిడ్ చేసే తరుణం కాదు’ అని ఈ మౌలానా హెచ్చరించినంత పని చేశాడు.