Mumbai: ఎనిమిదో తరగతి బాలికపై తోటి విద్యార్థుల అత్యాచారం.. తరగతి గదిలోనే దురాగతం..

సమాజంలో మానవ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి. ముఖ్యంగా అత్యచారాలు, దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నా పెద్దా ముసలి ముతకా అనే తేడా లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు కొందరు ప్రబుద్ధులు.....

Mumbai: ఎనిమిదో తరగతి బాలికపై తోటి విద్యార్థుల అత్యాచారం.. తరగతి గదిలోనే దురాగతం..
Harassment
Follow us

|

Updated on: Dec 02, 2022 | 12:19 PM

సమాజంలో మానవ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి. ముఖ్యంగా అత్యచారాలు, దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నా పెద్దా ముసలి ముతకా అనే తేడా లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు కొందరు ప్రబుద్ధులు.. ప్లేస్ తో సంబంధం లేకుండా కోరిక తీరితే చాలు అనేలా బిహేవ్ చేస్తున్నారు. మాట వినకపోతే దాడి చేయడం, గాయపరచడం వంటి హింసకూ పాల్పడుతున్నారు. కాదూ.. కూడదు అంటే హత్య చేసేందుకు వెనకాడటం లేదు. చిన్నారుల్లోనూ ఇలాంటి నేర ప్రవృత్తి పెరిగిపోతుండటం వణుకు పుట్టిస్తోంది. బుద్ధిగా స్కూల్ కు వెళ్లి చదువుకోవాల్సిన వారు.. తెలిసీ తెలియని వయసులో ఎట్రాక్క్షన్ తో వేధింపులకు దిగుతున్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబయి లో ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్ లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై అదే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించింది. అది కూడా క్లాస్ రూమ్ లోనే కావడం గమనార్హం.

మహారాష్ట్ర రాజధాని ముంబయి మహా నగరంలో దారుణ ఘటన జరిగింది. సెంట్రల్ ముంబైలోని హార్బర్ లైన్ లో ఉన్న ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ స్కూల్ లోని ఓ తరగతి గదిలో ఈ ఘటనకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం మిగతా విద్యార్థులందరూ గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లిన సమయంలో ఇదే అదనుగా భావించిన విద్యార్థులు ఆమెపై దాడి చేశారు. సమచారం తెలుసుకున్న బాలిక బంధువులు ఘటనపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన పూర్వాపరాలను విచారించిన పోలీసులు ఇద్దరు మైనర్ బాలురపై కేసు నమోదు చేశారు.

అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారు వెంటనే అలర్ట్ అయ్యి పోలీసుకు కంప్లైంట్ చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మైనర్ బాలురును జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు. వైద్య చికిత్స కోసం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ షాకింగ్ ఘటనతో స్కూల్లో మిగతా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. స్కూల్లో ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి