ఉపఎన్నికల్లో ఘోర పరాజయం.. చేసేదేమీ లేక మంత్రి పదవికి రాజీనామా..

మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తిదేవి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అందజేశారు.

ఉపఎన్నికల్లో ఘోర పరాజయం.. చేసేదేమీ లేక మంత్రి పదవికి రాజీనామా..
Follow us

|

Updated on: Nov 25, 2020 | 3:09 PM

మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తిదేవి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అందజేశారు. ఈమేతో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా ఉప ఎన్నికల్లో ఓటమిపాలవడంతో వారు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

మధ్యప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం కూడా విధితమే. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కమల్ నాథ్, జ్యోతిరాధిత్య సింధియా మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరింపజేశారు. అనంతరం ఆ 22 మందితో రాజీనామా చేయించారు. అలా మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కార్ కొలువుదీరేలా చక్రం తిప్పారు. అయితే రాజీనామా చేసిన వారిలో మంత్రులు కూడా ఉన్నారు. వీరి రాజీనామా నేపథ్యంలో ఇటీవల అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 19 మంది విజయం సాధించగా ముగ్గురు ఓడిపోయారు. ఇదిలాఉంటే, ఇమర్తిదేవిని కేబినెట్ హోదా కలిగిన ఏదైనా కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని మధ్యప్రదేశ్ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.