Chinook Helicopter: రికార్డు సృష్టించిన చినూక్ హెలికాప్టర్‌.. 1,910 కి.మీ నాన్‌స్టాప్‌ ప్రయాణం..

IAF Chinook Helicopter Sets New Record: భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ చరిత్రను తిరగరాసింది. ఏకబిగిన ప్రయాణించి వైమానిక దళం (IAF) హెలికాప్టర్ చినూక్ రికార్డు సృష్టించింది.

Chinook Helicopter: రికార్డు సృష్టించిన చినూక్ హెలికాప్టర్‌.. 1,910 కి.మీ నాన్‌స్టాప్‌ ప్రయాణం..
Chinook Helicopter
Follow us

|

Updated on: Apr 12, 2022 | 1:02 PM

IAF Chinook Helicopter Sets New Record: భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ చరిత్రను తిరగరాసింది. ఏకబిగిన ప్రయాణించి వైమానిక దళం (IAF) హెలికాప్టర్ చినూక్ రికార్డు సృష్టించింది. ఈ హెలికాప్టర్‌ సోమవారం చండీగఢ్ నుంచి అస్సాంలోని జోర్హాట్ వరకు ఏడున్నర గంటలపాటు 1910 కిలో మీటర్లు ప్రయాణించి అరుదైన ఘనతను కైవసం చేసుకుంది. చినూక్‌ హెలికాప్టర్‌ సామర్థ్యం తోపాటు వైమానిక దళ సిబ్బంది కార్యాచరణ, పక్కా ప్రణాళికతోనే ఈ రికార్డు సాధ్యమైందని నావికాదళం ప్రకటనలో వెల్లడించింది. భారత్‌లో ఓ హెలికాప్టర్ ఎక్కడా ఆగకుండా ఇంత సుదీర్ఘంగా ప్రయాణం చేయడం ఇదే ప్రథమం అంటూ అధికారులు తెలిపారు.

చినూక్ హెలికాప్టర్.. మల్టీ రోల్ హెలికాప్టర్. సైనిక దళాల రవాణా, ఇంధనం, ఆయుధ వ్యవస్థల తరలింపు కోసం సాయుధ దళాలు దీనిని వినియోగిస్తాయి. దీంతోపాటు విపత్తుల సమయాల్లో బాధితుల తరలింపు సేవల్లో, సహాయ సామగ్రి రవాణాలో చినూక్ హెలికాప్టర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. భారత వైమానిక దళం అవసరం మేరకు హెలికాప్టర్‌ను వీలైనంతగా సులభంగా మోహరించేందుకు వీలు కల్పిస్తుందని రక్షణ అధికారి తెలిపారు. దీంతోపాటు వేగవంతమైన మొబిలిటీ సౌలభ్యం కూడా ఉందని పేర్కొన్నారు.

కాగా.. చినూక్ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేస్తోంది. 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్స్ ఛాపర్‌లను అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు 2015లో భారత్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read:

Meat-eating: దేశంలో నాన్‌ వెజ్‌పై కొత్త వివాదం.. మాంసాహారం భారతీయుల ఆహారంలో భాగమేనా..?

Fire Accident: మూగజీవాల ప్రాణం తీసిన డంపింగ్ యార్డ్.. గోశాలలోని 38 ఆవులు అగ్నికి ఆహుతి..