కరోనా ఎఫెక్ట్ మోదీకి ఇలా కూడా ఉపయోగపడుతుందా..? రెబల్స్ దగ్గరవుతున్నారా..?

ప్రధాని నరేంద్ర మోదీపై ఎప్పుడూ గుర్రుగా ఉండే నేతలు… ఇప్పుడు మోదీకి జై కొడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్రమాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా గురించి చెప్పక్కర్లేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు.. బీజేపీకి బైబై చెప్పి.. హస్తం గూటికి చేరారు. అప్పట్లో మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం గుప్పించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి.. సిన్హా స్పందిస్తూ.. మోదీని పొగిడారు. […]

కరోనా ఎఫెక్ట్ మోదీకి ఇలా కూడా ఉపయోగపడుతుందా..? రెబల్స్ దగ్గరవుతున్నారా..?

ప్రధాని నరేంద్ర మోదీపై ఎప్పుడూ గుర్రుగా ఉండే నేతలు… ఇప్పుడు మోదీకి జై కొడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్రమాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా గురించి చెప్పక్కర్లేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు.. బీజేపీకి బైబై చెప్పి.. హస్తం గూటికి చేరారు. అప్పట్లో మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం గుప్పించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి.. సిన్హా స్పందిస్తూ.. మోదీని పొగిడారు. ప్రపంచం వణికిపొతూ.. చైనాలో చిక్కుకుపోయిన భారతీయుల్ని.. సురక్షితంగా వారివారి స్వస్థలాలకు తరలించారన్నారు. వుహాన్ నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయుల్ని.. సొంత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం చేర్చడంలో సక్కెస్ అయ్యిందని సిన్హా అన్నారు.

వుహాన్‌లో ఉన్న మనదేశస్థులను.. కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా.. బోయింగ్ 747 ప్రత్యేక విమానంలో మన దేశానికి తీసుకొచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెల్పుతూ.. ప్రధాని మోదీకి సెల్యూట్ అంటూ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. త్వరలో కరోనా వైరస్ క్షీణించాలని.. దాని బారిన పడిన వారంతా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు మరో ట్వీట్ చేశారు.

Published On - 2:13 am, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu