మీ త్యాగాలకు మా సెల్యూట్‌.. ప్రధాని మోదీ

దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది పోరాడారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. వారి పోరాటాన్ని, త్యాగాన్ని ఎన్నటికీ మరువమని అన్నారు. 25 జూన్‌ 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘సరిగ్గా 45 సంవత్సరాల క్రితం దేశంపై అత్యవసర పరిస్థితి విధించబడింది. ఆ సమయంలో.. భారతదేశ ప్రజాస్వామ్యం రక్షణ కోసం పోరాడిన వారు, హింసను అనుభవించిన వారందరికీ నేను […]

  • Sanjay Kasula
  • Publish Date - 2:12 am, Fri, 26 June 20
మీ త్యాగాలకు మా సెల్యూట్‌.. ప్రధాని మోదీ

దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది పోరాడారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. వారి పోరాటాన్ని, త్యాగాన్ని ఎన్నటికీ మరువమని అన్నారు. 25 జూన్‌ 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

‘సరిగ్గా 45 సంవత్సరాల క్రితం దేశంపై అత్యవసర పరిస్థితి విధించబడింది. ఆ సమయంలో.. భారతదేశ ప్రజాస్వామ్యం రక్షణ కోసం పోరాడిన వారు, హింసను అనుభవించిన వారందరికీ నేను వందనం చేస్తున్నాను! వారి త్యాగం దేశం ఎప్పటికీ మరచిపోదు.’ అని పేర్కొన్నారు.