Viral News: రియల్ పుష్ప మూవీ.. తలాక్ చెప్పడంతో మతం మారి.. హిందూ సంప్రదాయం ప్రకారం..

కొన్ని సంఘటనలు సినిమాల్లో మాత్రమే కనబడుతుంటాయి. రియల్ అలాంటివి జరగడం కొన్ని సందర్భాల్లో అసాధ్యమనే చెప్పుకోవాలి. కాని పరిస్థితుల కారణంగా మూవీలో కనిపించే ఘటనలు అప్పుడప్పుడు రియల్ గానూ కన్పిస్తాయి. జీవిత ప్రయాణంలో అనుకోకుండా ఏర్పడే కష్టాలను..

Viral News: రియల్ పుష్ప మూవీ.. తలాక్ చెప్పడంతో మతం మారి.. హిందూ సంప్రదాయం ప్రకారం..
Rubina Khan Married Prem Ku
Follow us

|

Updated on: Sep 25, 2022 | 9:17 AM

Uttar Pradesh: కొన్ని సంఘటనలు సినిమాల్లో మాత్రమే కనబడుతుంటాయి. రియల్ అలాంటివి జరగడం కొన్ని సందర్భాల్లో అసాధ్యమనే చెప్పుకోవాలి. కాని పరిస్థితుల కారణంగా మూవీలో కనిపించే ఘటనలు అప్పుడప్పుడు రియల్ గానూ కన్పిస్తాయి. జీవిత ప్రయాణంలో అనుకోకుండా ఏర్పడే కష్టాలను ఎదుర్కొవడం మహిళలకు కొన్ని సందర్భాల్లో కత్తిమీద సామే. పిల్లలు పుట్టిన తర్వాత.. భర్త వదిలేస్తే.. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు. వారి జీవితమంతా ఓ రకంగా చెప్పాలంటే నరకయాతనే. కాని ఓ మహిళ మాత్రం ఇలాంటి పరిస్థితులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని, సమాజం ఏమంటుందనే భయం వదిలి.. తన పిల్లల కోసం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన షోయబ్ ఉత్తరాఖండ్ కు చెందిన రుబీనాఖాన్ ను 9సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల భర్త షోయబ్ ట్రిపుల్ తలాఖ్ చెప్పి భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ముగ్గురు కుమారుల తల్లి అయిన రుబీనాఖాన్ కు ఏం చేయాలో తోచలేదు. దీంతో ఆమె పుష్పగా మారి భర్త స్నేహితుడు ప్రేమ్ పాల్ గంగ్వార్ ను పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ నగరం నవాబ్ గంజ్ లో రెండు రోజుల క్రితం హిందూ సంప్రదాయం ప్రకారం రుబీనాఖాన్, ప్రేమ్ పాల్ గంగ్వార్ విహహం జరిగింది.

మొదటి భర్త షోయబ్ డ్రైవరుగా పనిచేసే వాడని, తనపై అనుమానంతో తరచూ వేదించేవాడని రుబీనా ఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వారం రోజుల క్రితం తలాఖ్ చెబుతూ రుబీనాను ఇంటి నుంచి గెంటేశాడు. ఆసమయంలో షోయబ్ కారణంగా పరిచయమైన ప్రేమ్ పాల్ తనను ఆదరించడంతో ఆమె ‘పుష్ప’గా మారి కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. ఈవిషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ ట్రిపుల్ తలాక్ ఘటనలు చాలానే చూశాం. అయితే మత సంప్రదాయాలకు కట్టుబడి మహిళలు చాలామంది ట్రిపుల్ తలాక్ తో ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే కేంద్రప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్ ను నిషేధిస్తూ పార్లమెంటులో 2019లో చట్టంచేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత ట్రిపుల్ తలాక్ ఘటనలు కొంతమేర తగ్గినా.. ఇంకా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని సమర్థంగా ఎదుర్కొని రుబీనా ఖాన్ మతం మారి హిందూమతానికి చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకోవడం వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం రుబీనా ఖాన్ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..