ప్రధాని మోదీ మరో రికార్డ్.. హూస్టన్ సభకు 50 వేలమంది రిజిస్ట్రేషన్

ప్రధాని మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన వచ్చే( సెప్టెంబర్) నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన పాల్గొనే హౌడీ, మోదీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. అమెరికాలోని హూస్టన్‌లోని టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ హౌడీ, మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నైరుతి అమెరికాలో స్నేహపూర్వకంగా పలుకరించేటపుడు హౌ డూ యూ డూ? అనే వాక్యాన్ని సూక్ష్మాంగా హౌడీ అని సంబోధిస్తారు. సెప్టెంబరు […]

ప్రధాని మోదీ మరో రికార్డ్.. హూస్టన్ సభకు 50 వేలమంది రిజిస్ట్రేషన్
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 3:13 AM

ప్రధాని మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన వచ్చే( సెప్టెంబర్) నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన పాల్గొనే హౌడీ, మోదీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.

అమెరికాలోని హూస్టన్‌లోని టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ హౌడీ, మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నైరుతి అమెరికాలో స్నేహపూర్వకంగా పలుకరించేటపుడు హౌ డూ యూ డూ? అనే వాక్యాన్ని సూక్ష్మాంగా హౌడీ అని సంబోధిస్తారు. సెప్టెంబరు 22 ఆదివారం ఎన్ఆర్‌జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు . బారీ ఎత్తున జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉత్తర అమెరికాలో ఓ భారత దేశ ప్రధాన మంత్రి సభకు ఇంతమంది పేర్లు నమోదు చేయించుకోవడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు తెలిపారు.

ప్రధాని మోదీ వచ్చే నెల 27న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలకు హాజరుకానున్నారు. అంతకుముందు ఆయన హూస్టన్‌లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతారు. హూస్టన్‌లో 1,30,000 మంది ఇండియన్ అమెరికన్లు నివసిస్తున్నారు. భారత ప్రధాని మోదీకి ఇటువంటి అరుదైన రికార్డు దక్కడంపై భారతీయుల్లో ఆనందోత్సాలు వెల్లివిరుస్తున్నాయి.