Add Nominee EPF Account: ఉద్యోగి రిటైర్‌మెంట్ తరువాత లైఫ్ సెక్యూ్ర్ చేసే పథకాల్లో ఈపీఎఫ్ పథకం కీలకమైనది. ఒక ఉద్యోగి తన జీవితంలో కొంత మొత్తాన్ని ఈపీఎఫ్ అకౌంట్‌లో పొదుపు చేయడం ద్వారా పదవి విరమణ సమయానికి పెద్ద మొత్తంలో అమౌంట్‌ను పొందుతారు. ఇక ఉద్యోగి చేసిన పొదుపు మొత్తానికి వడ్డీ కూడా లభిస్తుంది. ఇది ఉద్యోగి రిటైర్‌మెంట్ తరువాత ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే, ఈపీఎఫ్ ఖాతాలో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి నామిని. దురదృష్టావశాత్తు ఉద్యోగి ప్రాణాలు కోల్పోతే ఇతర ఈపీఎఫ్ ద్వారా లభించే ప్రయోజనాలన్నీ నామినీ పొందుతారు. అందుకే మీ ఖాతాలో నామినీ పేరును ఎంపిక చేయడం కీలకం. కాగా, ఇంతకు ముందు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈపీఎఫ్ఓ ఆఫీసుకు వెళ్లి, ధరఖాస్తు చేయాల్సిన పని ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా.. నామినేషన్ ప్రక్రియను సరళతరం చేసింది ఈపీఎఫ్‌ఓ. ఈపీఎఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా సులభంగా ఇ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసి, నామిని పేరును యాడ్ చేయవచ్చు.
ఇ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి కింద పేర్కొన్న దశలను చూడండి.. 1: ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ UAN ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. 2: ‘మేనేజ్’ ఆప్షన్‌కు వెళ్లాలి. అక్కడ ‘ఇ-నామినేషన్’ సెలక్ట్ చేసుకోవాలి. 3: స్క్రీన్‌పై ‘వివరాలను అందించండి’ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఆ వివరాలు నమోదు చేశాక తదుపరి కొనసాగించడానికి ‘సేవ్’పై క్లిక్ చేయండి. 4. ‘కుటుంబ వివరాలను యాడ్ చేయండి’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తద్వారా మీ నామినీలను యాడ్ చేయవచ్చు. 5: ‘నామినేషన్ వివరాలు’పై క్లిక్ చేసి, కొత్త నామినీ పేరుతో నామినేట్ చేయాల్సిన షేర్ల సంఖ్య వంటి వివరాలను నమోదు చేయండి. తదుపరి దశకు వెళ్లడానికి వివరాలను సేవ్ చేయండి. 6: OTP కోసం ‘E-sign’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేయబడిన మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. 7. ఆ తరువాత OTPని ఎంటర్ చేసి సబ్‌మిట్ కొట్టండి. 8: OTP ధృవీకరించబడిన తర్వాత, కొత్త నామినీ పేరు మీ EPF ఖాతాకు యాడ్ చేయబడుతుంది.
Also read:
Cabbage Water Benefits: రోజూ క్యాబేజీ ఉడకబెట్టిన నీరు తాగడం వలన ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..
Vijayawada: ప్రైవేటు ల్యాబ్‌లల్లో అదనపు వసూళ్లు.. బెజవాడలో ముమ్మరంగా తనిఖీలు..