హాంకాంగ్ పై మళ్ళీ అమెరికా-చైనా మధ్య మడత పేచీ

హాంకాంగ్ మీద ఆధిపత్యానికి అమెరికా, చైనా మధ్య  మళ్ళీ మడత పేచీ ప్రారంభమైంది. హాంకాంగ్ , దాని ప్రత్యేక ప్రతిపత్తి విషయాన్ని అడ్డుపెట్టుకుని చైనా కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించేందుకు సిధ్ధం కాగా-అమెరికా మోకాలడ్డుతోంది. తమ దేశ చట్టాల ప్రకారం స్పెషల్ ట్రీట్ మెంట్ కి హాంకాంగ్ అర్హం కాదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. హాంకాంగ్ అటానమీని, దాని ఫ్రీడమ్ ని దిగజార్చడానికి చైనా వరుసగా చేపట్టిన చర్యల్లో ఇది ఓ […]

హాంకాంగ్ పై మళ్ళీ అమెరికా-చైనా మధ్య మడత పేచీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 28, 2020 | 1:46 PM

హాంకాంగ్ మీద ఆధిపత్యానికి అమెరికా, చైనా మధ్య  మళ్ళీ మడత పేచీ ప్రారంభమైంది. హాంకాంగ్ , దాని ప్రత్యేక ప్రతిపత్తి విషయాన్ని అడ్డుపెట్టుకుని చైనా కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించేందుకు సిధ్ధం కాగా-అమెరికా మోకాలడ్డుతోంది. తమ దేశ చట్టాల ప్రకారం స్పెషల్ ట్రీట్ మెంట్ కి హాంకాంగ్ అర్హం కాదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. హాంకాంగ్ అటానమీని, దాని ఫ్రీడమ్ ని దిగజార్చడానికి చైనా వరుసగా చేపట్టిన చర్యల్లో ఇది ఓ భాగమని ఆయన ఆరోపించారు. హాంకాంగ్ లో వేర్పాటువాదాన్ని, తీవ్రవాద కార్యకలాపాలను అదుపు చేయడానికి జాతీయ భద్రతా చట్టం అవసరమని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో చైనీస్ ఇంటెలిజెన్స్ సంస్థలు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. 1997 లో బ్రిటన్ దీన్ని చైనాకు అప్పగించినప్పటి ఒప్పందం లోనే ఈ అంశం ఉందని చైనా వాదిస్తోంది. అయితే ఆ దేశ పెత్తనం మీద ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న హాంకాంగ్ వాసులు గత బుధవారం వీధుల్లో పెద్దఎత్తున నిరసనలకు దిగారు. వేలాది ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్ప వాయువు, రబ్బర్ పెలెట్లను ప్రయోగించారు. సుమారు నాలుగు వందలమందిని అరెస్టు చేశారు.

అమెరికా-చైనా మధ్య హాంకాంగ్ నలిగిపోతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం హాంకాంగ్ కి అమెరికా నుంచి కొన్ని ఎకనామిక్ ప్రయోజనాలే అందుతున్నాయి. చైనా వంక పెట్టుకుని ప్రెసిడెంట్ ట్రంప్ వీటిలో కొన్నింటికి చెక్ పెట్టవచ్చునని భావిస్తున్నారు. అలాగే హాంకాంగ్ లోని చైనీస్ వ్యాపారాల పైనా, చైనా అధికారులపైన కూడా ఆయన ఆంక్షలు విధించవచ్చు. అమెరికా-చైనా మధ్య రేగిన టారిఫ్ వార్ ఇంకా కొనసాగుతున్న విషయం గమనార్హం.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..