మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి అమిత్‌ షా

డిశ్చార్జి‌ అయి దాదాపు రెండు వారాల తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్లీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:01 am, Sun, 13 September 20
మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి అమిత్‌ షా

Amit Shah admitted hospital: డిశ్చార్జి‌ అయి దాదాపు రెండు వారాల తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్లీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆగష్టు 2న అమిత్ షాకు కరోనా రావడంతో గుర్‌గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత ఆగష్టు 14న ట్వీట్ చేసిన హోం మంత్రి.. వైద్యుల సలహా మేరకు మరో కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉంటానని వెల్లడించారు. అయితే నీరసం, శరీర నొప్పులతో ఆగష్టు 18న ఎయిమ్స్‌లో చేరారు. ఆగష్టు 31న అక్కడి నుంచి డిశ్చార్జి అవ్వగా.. కేంద్రమంత్రి కరోనా నుంచి కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే శనివారం రాత్రి మళ్లీ  ఎయిమ్స్‌కి ఆయనను తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఆసుపత్రి వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More:

ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేశారో.. రవాణాశాఖ హెచ్చరిక

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 : డబ్బింగ్‌ మొదలెట్టిన మనోజ్‌ భాజ్‌పాయ్‌