Viral Video: గుట్టు రట్టయ్యిందని.. కారుతో ఢీకొట్టి మహిళ దారుణ హత్య.. సీసీ కెమెరాల్లో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు

Gujarat: వివాహేతర సంబంధం గురించి తెలిసిందని ఓ మహిళను దారుణంగా హతమార్చారు. కారుతో ఢీకొట్టి చంపారు. అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

Viral Video: గుట్టు రట్టయ్యిందని.. కారుతో ఢీకొట్టి మహిళ దారుణ హత్య.. సీసీ కెమెరాల్లో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు
Hit And Run
Follow us

|

Updated on: Sep 15, 2022 | 5:07 PM

Gujarat: వివాహేతర సంబంధం గురించి తెలిసిందని ఓ మహిళను దారుణంగా హతమార్చారు. కారుతో ఢీకొట్టి చంపారు. అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్లు ఈ ఘటనపై లోతుగా విచారణ చేపడితే షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం గురించి తెలిసిందనే సదరు మహిళను ఉద్దేశ పూర్వకంగా కారుతో ఢీకొట్టి చంపారని విచారణలో తేలింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో గత శనివారం ఓ కారు వేగంగా మహిళను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే కన్నుమూసింది. డ్రైవర్‌ మాత్రం వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. తొలుత ఇది ప్రమాదమని అందరూ భావించారు. అయితే మృతురాలి సోదరుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజం బయటకు వచ్చింది.

మృతురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజ్​ను నిశీతంగా పరిశీలించి చివరకు ఇది హత్యే అని తేల్చారు. వెంటనే నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అదే ప్రాంతంలోని ఓ గెస్ట్‌ హౌస్‌లో దాగి ఉన్న నిందితుడు ఆదిల్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతనికి మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆ విషయం మృతురాలికి తెలియడం వల్ల ఆమె ఎక్కడ ఈ విషయాన్ని బయటపెడుతుందో అన్న భయంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ఆదిల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..