రజినీ నిర్ణయంపై స్పందించిన ఆయన సోదరుడు.. పార్టీ ఏర్పాటు విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు..

అనారోగ్య పరిస్థితుల కారణంగా పార్టీ ఏర్పాటు విరమించుకున్నట్లు సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రజినీ

  • uppula Raju
  • Publish Date - 7:58 am, Wed, 30 December 20
రజినీ నిర్ణయంపై స్పందించిన ఆయన సోదరుడు.. పార్టీ ఏర్పాటు విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు..

అనారోగ్య పరిస్థితుల కారణంగా పార్టీ ఏర్పాటు విరమించుకున్నట్లు సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రజినీ సోదరుడు సత్యనారాయణ రావు స్పందించారు. పార్టీ ఏర్పాటు రజినీ ఇష్టమని, తన ఆలోచనను ఎవరూ మార్చలేరని అన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో పార్టీ ఏర్పాటును విరమించుకోవడాన్ని ఆయన సమర్థించారు.

అయితే పార్టీ పెడతారని ప్రజలందరు ఎదురుచూస్తున్నారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తాము కూడా పార్టీ ప్రారంభిస్తారనే అనుకున్నామని, కానీ ఆరోగ్య కారణాలు ఉండటం వల్ల బలవంతం చేయలేకపోయామన్నారు. రజినీ కాంత్ ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే అని సమర్థించారు. రజినీకాంత్ మాటమీద మీద నిలబడే వ్యక్తని ఏం చెబుతాడో అదే చేస్తాడని తెలిపారు. అయితే రజినీకాంత్ అనారోగ్యానికి గురి కావడాన్ని దేవుడి నిర్ణయంగా భావించి వెనుదిరిగారు. అందుకే ఇప్పుడున్న పార్టీల దృష్ట్యా పార్టీ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పారు. ఈ నిర్ణయం అభిమానులను నిరాశకు గురిచేస్తోందని తెలిసినా తాను కూడా బాధతోనే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.