రెండు రాష్ట్రాల హింసపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ‘విశ్లేషణ’.. మిజోరం ప్రభుత్వంపై మండిపాటు

తమ రాష్ట్రానికి, మిజోరంకు మధ్య హింసకు దారి తీసిన కారణాలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విశ్లేషించారు. ఆ రాష్ట్రం నుంచి అక్రమ డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడం, పశు సంరక్షణ చట్టాన్ని అమలు చేయడం ముఖ్యంగా ఈ హింసాత్మక ఘటనలకు

రెండు రాష్ట్రాల హింసపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 'విశ్లేషణ'.. మిజోరం ప్రభుత్వంపై మండిపాటు
Himanta Analysis On Violence With Mizoram Assam Cm Himanta Biswa Sharma
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 28, 2021 | 9:58 AM

తమ రాష్ట్రానికి, మిజోరంకు మధ్య హింసకు దారి తీసిన కారణాలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విశ్లేషించారు. ఆ రాష్ట్రం నుంచి అక్రమ డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడం, పశు సంరక్షణ చట్టాన్ని అమలు చేయడం ముఖ్యంగా ఈ హింసాత్మక ఘటనలకు దారి తీశాయని ఆయన పేర్కొన్నారు. మయన్మార్ నుంచి మాదక ద్రవ్యాలు మిజోరం ద్వారా తమ రాష్ట్రం లోని బరాక్ వ్యాలీకి, అక్కడి నుంచి పంజాబ్ కు రవాణా అవుతోందని ఆయన తెలిపారు. అలాగే మిజోరం ప్రజలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, స్నిఫర్ రైఫిల్స్ ఎలా అందుతున్నాయని ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. తనకు గట్టి వీడియో ఆధారాలు ఉన్నాయని, మీ రాష్ట్రంలో గత రెండు నెలలుగా బయటి శక్తులు తిష్ట వేశాయని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత సృష్టించాలన్నదే వీరి ప్లాన్ అని ఆయన తేల్చారు. ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు ఇంత హఠాత్తుగా వయొలెన్స్ చెలరేగిందంటే ఇందుకు కారణాలను ఊహించాలని శర్మ..మిజోరం సీఎం జొరాంతంగాను కోరారు.మయన్మార్ నుంచి శరణార్థులకు మీ రాష్ట్రం ఆశ్రయం ఇస్తోందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది మిజోరాం వాసులకు ఇష్టం లేదన్నారు.

ఇలా ఉండగా-అస్సాం, మిజోరం రాష్టాల సరిహద్దులవద్ద భద్రతను పెంచారు. అదనపు బలగాలను మోహరించారు. ఇటీవలి హింసలో మరణించిన అస్సాం పోలీసుల సంఖ్య ఏడుకు పెరిగింది. తీవ్రంగా గాయపడిన ఓ పోలీసు చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఆ అల్లర్లలో 80 మందికి పైగా గాయపడ్డారు. అటు-నాగాలాండ్ సరిహద్దు పొడవునా కూడా అస్సాం ప్రభుత్వం భద్రతను పెంచింది. సరిహద్దుల్లో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు, రెబెల్ గ్రూపులు పొంచి ఉన్నాయని ఈ ప్రభుత్వానికి సమాచారం అందింది.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : కన్నడిగులకు కొత్త సీఎం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 పోలీసోడి బైకుకే పాము ఎసరు !చూసుకోకుండా బైక్ డ్రైవ్ చేసిన పోలీస్..ఎం జరిగిందో తెలుసా..?:Snake in police bike Video.

 బీటెక్ విద్యార్థులకు శుభవార్త..ఐటీ రంగంలో పుంజుకుంటున్న ఉద్యోగ అవకాశాలు..:B Tech Students video.

 వెంకటేష్ గారు ఫస్ట్ చదువుకోమన్నారు..! సిన్నప్ప ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ…:Narappa Movie Rakhi interview Video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu