Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో మొదలైన సీఎం కుర్చీ లాడాయి.. రేసులో ముగ్గురు.. ఇందులో ఒకరు ఎంపీ..

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ 43.90 శాతం ఓట్లతో 40 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జోరందుకుంది.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో మొదలైన సీఎం కుర్చీ లాడాయి.. రేసులో ముగ్గురు.. ఇందులో ఒకరు ఎంపీ..
Himachal Pradesh Assembly Election
Follow us

|

Updated on: Dec 09, 2022 | 10:55 AM

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ హోరా హోరీ పోరాటం జరగ్గా.. గెలుపు కాంగ్రెస్ వైపే మొగ్గింది. అయితే ఇప్పుడే అసలు కథ ఇప్పుడే మొదలైంది. ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించకపోవడంతో ఇప్పుడు గెలిచినవారిలో ఒకరిని నిర్ణయించాలి.. కానీ,  ముఖ్యమంత్రి పీఠం కోసం మరొకరు కూడా పోటీలో ఉన్నారు. దీంతో ఈ పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇందులో సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ప్రతిభా సింగ్ పేర్లతో సహా ముగ్గురి పేర్లు రేసులో ఉన్నాయి. ప్రతిభా సింగ్ ఎంపీ అయినప్పటికీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాగా సుఖు, అగ్నిహోత్రి తమ స్థానాలను గెలుచుకున్నారు. మరో ఇద్దరు నేతలు ఆశా కుమారి, కౌల్ సింగ్ ఠాకూర్ దాదాపు రేసుకు దూరంగా ఉన్నారు. కుమారి డల్హౌసీ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె సీటు కోల్పోయింది. 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఠాకూర్ కూడా మండిలోని డ్రాంగ్ ప్రాంతంలో ఓడిపోయారు.

పార్టీ సమావేశాన్ని ఏర్పాటు..

హిమాచల్ ప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన తమ ఎమ్మెల్యేలందరినీ శుక్రవారం సిమ్లాలో కాంగ్రెస్‌ సమావేశపరిచింది. ఈ సమావేశంలో, లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నాయకుడిని ఎన్నుకునే అధికారం కాంగ్రెస్ అధ్యక్షుడికి కల్పిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించవచ్చు. ఇంతకుముందు, పార్టీ తన ఎమ్మెల్యేలందరినీ చండీగఢ్‌కు పిలిపించింది. హిమాచల్ లో ఎన్నికైన ఎమ్మెల్యేలను రాష్ట్రం నుంచి తరలించడమే మంచిదని నిర్ణయించారు. అందులో భాగంగా ఎవ్వరూ పెద్దగా సెలబ్రేషన్లు చేసుకోవద్దనీ. గెలుపు ధృవీకరణ పత్రాలు తీస్కున్న వెంటనే.. అధిస్టానం సూచనలు తప్పక పాటించాలని పిలుపునిచ్చారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో తన కార్యక్రమాన్ని మార్చుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ సంతోషంగా ఉందని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ రాజీవ్‌ శుక్లా అన్నారు. 10 హామీలను నెరవేర్చేందుకు, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కాంగ్రెస్‌ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

సీఎం రేసులో ఉన్న నేతలు వీరే..

సుఖ్విందర్ సింగ్ సుఖు

సుఖు పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రచార కమిటీకి చీఫ్‌గా కూడా ఉన్నారు. సెంట్రల్ హిమాచల్‌లోని నదౌన్ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖుకు పార్టీ క్యాడర్‌లో మంచి పట్టు ఉండడంతో ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారుల్లో ఒకరిగా పరిగణిస్తున్నారు. అధికారికంగా ముఖ్యమంత్రిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సుక్కు తెలిపారు.

ముఖేష్ అగ్నిహోత్రి

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేష్ అగ్నిహోత్రి ప్రతిపక్ష నేత. హిమాచల్ ప్రదేశ్‌లోని హరోలి స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. డీలిమిటేషన్‌కు ముందు ఆయన సీటును సంతోక్‌గఢ్ అని పిలిచేవారు. 2003లో తొలిసారిగా ఈ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2017 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అగ్నిహోత్రి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) నాయకుడిగా ఎన్నికయ్యారు.

ప్రతిభా సింగ్

ఆమె హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య, హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా. 2004లో తొలిసారి హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీ చేసి మహేశ్వర్ ఠాకూర్‌పై విజయం సాధించారు. 2013 ఉప ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీ నేత జైరాం ఠాకూర్‌పై విజయం సాధించారు. బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ మరణం తర్వాత ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు.

ఫలితాలు ఇలా..

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లకు గానూ 40 సీట్లను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన మూడు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేక పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కేవలం జీరో పాయింట్ 9శాతం మాత్రం ఓటింగ్ పర్సెంటేజ్ తేడా ఉంది. కాంగ్రెస్‌కు 43.91శాతం మంది ఓట్లేస్తే.. బీజేపీ 43 శాతం మంది ఓటేశారు. ఆప్‌కి 1.10శాతం ఓట్లు పోలయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!