లక్నోకు వెళ్లేందుకు నిరాకరించిన హత్రాస్ కుటుంబం

అలహాబాద్ హైకోర్టు ముందు హాజరయ్యేందుకు లక్నో వెళ్ళడానికి హత్రాస్ కుటుంబం నిరాకరించింది. ఈ రాత్రివేళ ప్రయాణిస్తే తమకు భద్రత ఉండదని ఈ కుటుంబ సభ్యులు భావించారు. దాంతో ఈ ఫ్యామిలీ రేపు ఆ నగరానికి బయలుదేరుతుంది. హత్రాస్ ఘటన నేపథ్యంలో ఈ కుటుంబంలో ఒకరు తమ ఎదుట ఈ నెల 12 న హాజరు కావాలని అలహాబాద్ హైకోర్టు గతంలోనే ఆదేశించింది. మొత్తానికి పటిష్టమైన పోలీసు బందోబస్తుతో వీరు సోమవారం లక్నో వెళ్లనున్నారు. హత్రాస్ ఘటనను తీవ్రంగా […]

లక్నోకు వెళ్లేందుకు నిరాకరించిన హత్రాస్ కుటుంబం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 11, 2020 | 4:13 PM

అలహాబాద్ హైకోర్టు ముందు హాజరయ్యేందుకు లక్నో వెళ్ళడానికి హత్రాస్ కుటుంబం నిరాకరించింది. ఈ రాత్రివేళ ప్రయాణిస్తే తమకు భద్రత ఉండదని ఈ కుటుంబ సభ్యులు భావించారు. దాంతో ఈ ఫ్యామిలీ రేపు ఆ నగరానికి బయలుదేరుతుంది. హత్రాస్ ఘటన నేపథ్యంలో ఈ కుటుంబంలో ఒకరు తమ ఎదుట ఈ నెల 12 న హాజరు కావాలని అలహాబాద్ హైకోర్టు గతంలోనే ఆదేశించింది. మొత్తానికి పటిష్టమైన పోలీసు బందోబస్తుతో వీరు సోమవారం లక్నో వెళ్లనున్నారు. హత్రాస్ ఘటనను తీవ్రంగా పరిగణించిన కోర్టు.. అక్టోబరు  12 న తమ ముందు హాజరు కావాలని యూపీ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశిస్తూ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.