Nupur Sharma: నుపుర్ శర్మకు రిలీఫ్.. అన్ని కేసులు ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు

మహ్మాద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. దేశ వ్యాప్తంగా ఆమెపై నమోదైన కేసులను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలన్న నుపుర్ శర్మ విజ్ఞప్తిపై భారత అత్యున్నతన్యాయస్థానం

Nupur Sharma: నుపుర్ శర్మకు రిలీఫ్.. అన్ని కేసులు ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు
Nupur Sharma
Follow us

|

Updated on: Aug 11, 2022 | 8:31 AM

Nupur Sharma: మహ్మాద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. దేశ వ్యాప్తంగా ఆమెపై నమోదైన కేసులను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలన్న నుపుర్ శర్మ విజ్ఞప్తిపై భారత అత్యున్నతన్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తూ.. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా న‌మోదైన 10 కేసుల‌ను ఢిల్లీ కోర్టుకు బ‌దిలీ చేయాల‌ని ఆదేశాలు జారీచేసింది. ఆ కేసుల‌న్నింటినీ ఢిల్లీ పోలీసులే విచారిస్తార‌ని స్పష్టంచేసింది. ఇక‌పై నుపుర్ శర్మపై ఎక్కడ ఎఫ్ఐఆర్ న‌మోదైన ఆ కేసుల‌న్నీ ఢిల్లీ కోర్టుకే బ‌దిలీ అవుతాయ‌ని, ఢిల్లీ పోలీసులే పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలోనూ తనపై దేశ వ్యాప్తంగా నమోదైన కేసులను ఢిల్లీకే బదిలీచేయాలని కోరగా.. అప్పుడు ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం..నుపుర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మరోసారి ఆమె ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించగా.. నుపుర్ శర్మకు ప్రాణహాణి ఉండటంతో ఆమెపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు నుపుర్ శర్మను అరెస్ట్ చేయరాదని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మహ్మద్ ప్రవక్తను కించపర్చే విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ నుపుర్ శర్మపై పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈవివాదం రాజకీయంగానూ దుమారం రేపడంతో నుపుర్ శర్మను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇలా ఉండగా.. నుపుర్‌శర్మ మధ్యంతర బెయిల్‌ కొనసాగుతుందని కూడా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జులై 19న ఆమెకు మధ్యంతర బెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..