ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఒక్క రోజు ముఖ్యమంత్రి.. అద్భుత అవకాశం దక్కించుకున్న ఇరవై ఏళ్ల యువతి..

తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకేఒక్కడు సినిమా దాదాపుగా అందరికి గుర్తుండే ఉంటుంది. ఇందులో హీరో అర్జున్ ఒక్క రోజు

  • uppula Raju
  • Publish Date - 12:09 pm, Sun, 24 January 21
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఒక్క రోజు ముఖ్యమంత్రి.. అద్భుత అవకాశం దక్కించుకున్న ఇరవై ఏళ్ల యువతి..

తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకేఒక్కడు సినిమా దాదాపుగా అందరికి గుర్తుండే ఉంటుంది. ఇందులో హీరో అర్జున్ ఒక్క రోజు సీఎంగా బాధ్యతలు చేపట్టి ఎన్నో మార్పులు తీసుకువస్తాడు. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకోబోతుంది. కాకపోతే ఇక్కడ ఇరవై సంవత్సరాల యువతి ఒక్క రోజు సీఎంగా బాధ్యతలు చేపట్టనుంది. హరిద్వార్‌ జిల్లా దౌలత్‌పూర్‌ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామికి బాలికా దినోత్సవం సందర్భంగా ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ యువతి బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. 2018లో ఉత్తరాఖండ్‌ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. 2009లో థాయిలాండ్‌లో జరిగిన బాలికల అంతర్జాతీయ లీడర్‌షిప్‌ కార్యక్రమానికి హాజరైంది. సృష్టి తండ్రి కిరాణ షాపు నిర్వహిస్తుండగా తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం చేస్తుంది.

ఏటా జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అందులో భాగంగా ఉత్తరాఖండ్‌ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సృష్టిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. దీంతో ఆదివారం ఉత్తరాఖండ్‌ వేసవి రాజధాని అయిన గైర్‌సెన్‌లో సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌తో కలిసి సృష్టి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహించనుంది. ఆయుష్మాన్‌భవ, స్మార్ట్‌ సిటీ, పర్యాటకతో పాటు ఇతర శాఖల కార్యక్రమాలు, పథకాలపై అధికారులతో సీఎం హోదాలో చర్చించనుంది. ఇలా చేయడం వల్ల బాలికల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా సీఎంగా వ్యవహరిస్తున్న సృష్టిని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి గ్రేట్ కాంబినేషన్‌లో సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా..