‘కరోనా వైరస్’ని కూడా వదిలిపెట్టని హ్యాకర్లు!

సొమ్మును దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు తొక్కని.. దారంటూ లేదు. ఒక్క మెసేజ్‌తోనే లక్షలు.. లక్షలు మాయం చేస్తారు. ఇప్పుడు ‘కరోనా’ వ్యాధిని కూడా వాళ్లకు ఆసరాగా మార్చుకుని అడ్డంగా డబ్బులను దోచుకుంటున్నారు ఈ నేరగాళ్లు. అదెలాగా అని అనుకుంటున్నారా? గత కొద్ది రోజుల నుంచి కరోనాతో ప్రపంచం మొత్తం గడగడలాడిపోతోంది. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్‌కి చైనాలో దాదాపు 400 మందికి పైగా మృతి చెందారు. దీంతో.. ఆ దేశంతో పాటు.. వివిధ దేశాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు […]

'కరోనా వైరస్'ని కూడా వదిలిపెట్టని హ్యాకర్లు!

సొమ్మును దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు తొక్కని.. దారంటూ లేదు. ఒక్క మెసేజ్‌తోనే లక్షలు.. లక్షలు మాయం చేస్తారు. ఇప్పుడు ‘కరోనా’ వ్యాధిని కూడా వాళ్లకు ఆసరాగా మార్చుకుని అడ్డంగా డబ్బులను దోచుకుంటున్నారు ఈ నేరగాళ్లు. అదెలాగా అని అనుకుంటున్నారా? గత కొద్ది రోజుల నుంచి కరోనాతో ప్రపంచం మొత్తం గడగడలాడిపోతోంది. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్‌కి చైనాలో దాదాపు 400 మందికి పైగా మృతి చెందారు. దీంతో.. ఆ దేశంతో పాటు.. వివిధ దేశాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పుడు ఈ భయాన్నే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ వైరస్ భారిన పడకుండా ఉండాలంటే.. ఈ రకమైన జాగ్రత్తలు, మందులు తీసుకోవాలంటూ.. మెయిల్స్‌కి, ఫోన్లకు, సోషల్ మీడియా వేదికగా.. లింక్స్‌ని పంపుతున్నారు. సరే ఇది కూడా మంచిదే కదా అని అభిప్రాయపడ్డ ప్రజలు ఆ లింక్స్‌ని ఓపెన్ చేస్తున్నారు. దీంతో.. వారి ఖాతాలలోని డబ్బుతో పాటు ముఖ్యమైన సమాచారన్ని కూడా హ్యాకర్లు దోచుకుంటున్నారు. ఇలా మీకు తెలియకుండానే.. ఒక్క మెసేజ్‌తో చాకచక్యంగా చోరీలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రైమ్స్‌పై స్పందించిన పోలీసులు ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సంబంధం లేని, తెలియని లింక్స్‌ని ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు.

Published On - 1:27 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu