Tamil Nadu: మరో ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5 లక్షల మంది రోగుల డేటాను అమ్మేశారు..

హాస్పిటల్స్‌పై హ్యాకర్స్‌ ఎటాక్స్‌ కొనసాగుతున్నాయి. వారం రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్‌ను టార్గెట్ చేసిన హ్యాకర్లు.. ఇప్పుడు తమిళనాడు ఆస్పత్రిపై కన్నేశారు. శ్రీశరణ్‌ ఆస్పత్రి డేటాను చోరీ చేసి సైబర్‌ క్రైమ్‌ ఫోరమ్‌లో అమ్మేశారు...

Tamil Nadu: మరో ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5 లక్షల మంది రోగుల డేటాను అమ్మేశారు..
Cyber Crime
Follow us

|

Updated on: Dec 04, 2022 | 9:07 AM

హాస్పిటల్స్‌పై హ్యాకర్స్‌ ఎటాక్స్‌ కొనసాగుతున్నాయి. వారం రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్‌ను టార్గెట్ చేసిన హ్యాకర్లు.. ఇప్పుడు తమిళనాడు ఆస్పత్రిపై కన్నేశారు. శ్రీశరణ్‌ ఆస్పత్రి డేటాను చోరీ చేసి సైబర్‌ క్రైమ్‌ ఫోరమ్‌లో అమ్మేశారు. దాదాపు లక్షన్నర మంది రోగుల డేటాను ఆన్‌లైన్‌లో విక్రయించారు సైబర్‌ నేరగాళ్లు. 2007 నుంచి 2011 వరకు ఈ ఆస్పత్రికి వెళ్లిన రోగుల పేర్లు, అడ్రస్‌లు, పర్సనల్‌ డేటాను, వైద్యుల వివరాలను నాలుగు వందల డాలర్ల చొప్పున అమ్మేశారు. థ్రీ క్యూ ఐటీ ల్యాబ్‌ అనే థర్డ్‌ పార్టీ వెండర్‌ నుంచి ఈ డేటాను చోరీ చేశారు హ్యాకర్లు. సైబర్‌ ఎటాక్స్‌ని గుర్తించే క్లౌడ్‌సెక్‌ సంస్థ దీన్ని బయటపెట్టింది. ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్లపై సైబర్‌ ఎటాక్‌ జరిగిన నెక్ట్స్‌ డేనే తమిళనాడు ఆస్పత్రిపైనా హ్యాకర్లు దాడి చేసినట్లు గుర్తించారు. శ్రీశరణ్‌ హాస్పిటల్‌ డేటా బేస్‌ను హ్యాక్‌ చేసి కీలక ఇన్ఫర్మేషన్‌ను కొల్లగొట్టారు.

గత నెల 23న ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్లపై సైబర్‌ నేరగాళ్లు మాసివ్‌ అటాక్‌ చేశారు. ఇన్‌ పేషెంట్‌, ఔట్‌ పేషెంట్‌, స్మార్ట్‌ ల్యాబ్స్‌, అపాయింట్‌మెంట్స్‌, రిజిస్ట్రేషన్స్‌ ఇలా అన్ని వింగ్స్‌లోకి చొరబడ్డారు. దాంతో, ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్‌ వ్యవస్థ కుప్పకూలింది. సర్వర్లను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు, 2 వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం కలకలం రేపింది. ఢిల్లీ ఎయిమ్స్‌ డేటా బేస్‌లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మాజీ ప్రధానులు, కేంద్ర మంత్రులతో పాటు వీవీఐపీస్ పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌ ఉండటంతో టెన్షన్‌ కలిగించింది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్లలో యాంటీ వైరస్‌ సొల్యూషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

ఎయిమ్స్‌లో సర్వర్లు మొరాయించినట్లు నవంబర్ 23 న తొలిసారి గుర్తించారు. అనంతరం హ్యాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌ నుంచి హ్యాకర్లు రూ.200 కోట్లు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. హ్యాక్‌ చేసిన ఐదు సర్వర్లలో దాదాపు 4 కోట్ల మంది రోగుల సమాచారం నిక్షిప్తమై ఉంది. ప్రస్తుతం ఎయిమ్స్‌లో సర్వర్లు, కంప్యూటర్లకు యాంటీ వైరస్‌ సొల్యూషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..