Gyanvapi Mosque Case: జ్ఞాన్‌వాపి కేసులో మధ్యంతర ఉత్తర్వులు.. మూడు సూచనలు చేసిన సుప్రీం కోర్టు..

Gyanvapi Mosque Case: జ్ఞాన్‌వాపి కేసులో మధ్యంతర ఉత్తర్వులు.. మూడు సూచనలు చేసిన సుప్రీం కోర్టు..
Gyanvapi Mosque Case

సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మూడు కీలక సూచనలు చేసింది. దీని ద్వారా అన్ని పక్షాల ప్రయోజనాలను పరిరక్షిస్తామని జస్టిస్ చంద్రచూడ్ హామీ ఇచ్చారు. చివరికి కోర్టు ఉత్తర్వులు..

Sanjay Kasula

|

May 20, 2022 | 4:51 PM

జ్ఞాన్‌వాపి కేసులో హిందూ, ముస్లిం పక్షాలు ఇవాళ తమ తరపున గట్టి వాదనలు వినిపించాయి. ఇది చాలా క్లిష్టమైన, సున్నితమైన కేసు అని సుప్రీంకోర్టు గుర్తించింది. దీన్ని బట్టి సుదీర్ఘ అనుభవం ఉన్న న్యాయమూర్తికి పంపాలని కోర్టు భావిస్తోంది. శాంతి, సామరస్యాలను కాపాడుకోవడం మన బాధ్యత అని సుప్రీంకోర్టు పేర్కొంది. వర్గాల మధ్య సోదరభావం ఉండాలి.. ప్రతిచోటా శాంతి ఉండాలని పేర్కొంది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మూడు కీలక సూచనలు చేసింది. దీని ద్వారా అన్ని పక్షాల ప్రయోజనాలను పరిరక్షిస్తామని జస్టిస్ చంద్రచూడ్ హామీ ఇచ్చారు. చివరికి కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ మొత్తం వ్యవహారాన్ని జిల్లా జడ్జికి పంపింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎనిమిది వారాల పాటు కొనసాగుతాయి. వాజుకు జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. శివలింగం లభించిన ప్రాంతాన్ని పరిరక్షిస్తూ, ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నదే మధ్యంతర ఆదేశాలు జరి చేసింది. వాజుఖానా ప్రాంతంలో శివలింగం బయటపడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రాంతంలో వాజుఖానా ఏర్పాటు చేస్తూ ప్రార్థనలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది కోర్టు.

ఇవి కూడా చదవండి

సుప్రీం కోర్ట్ మూడు సూచనలు 1. ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం ట్రయల్ కోర్టు దరఖాస్తును పక్కన పెట్టాలి. 2. సుప్రీం కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం దరఖాస్తును పరిష్కరించే వరకు కొనసాగుతుంది. 3. విషయం సంక్లిష్టత, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని.. జిల్లా జడ్జికి 25 సంవత్సరాల అనుభవం ఉన్నందున కేసును విచారించాలి. జిల్లా న్యాయమూర్తి విచక్షణను ప్రశ్నించకూడదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu