Gwalior Court: నెల రోజులు ఇల్లరికం వెళ్లండి.. గ్వాలియర్ కోర్టు సంచలన తీర్పు

వివాహం(Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. రెండు మనసులే కాకుండా రెండు కుటుంబాలు కలిసే అరుదైన ఘట్టం పెళ్లి. ఎన్నో కలలతో నూతన నవ దంపతులు నూతన జీవితంలోకి...

Gwalior Court: నెల రోజులు ఇల్లరికం వెళ్లండి.. గ్వాలియర్ కోర్టు సంచలన తీర్పు
Justice
Follow us

|

Updated on: Feb 28, 2022 | 2:38 PM

వివాహం(Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. రెండు మనసులే కాకుండా రెండు కుటుంబాలు కలిసే అరుదైన ఘట్టం పెళ్లి. ఎన్నో కలలతో నూతన నవ దంపతులు నూతన జీవితంలోకి అడుగుపెడతారు. ఒకరి ఇష్టాయిష్టాలను గౌరవించుకుంటూ అన్యోన్యంగా కలిసిపోతారు. కొన్ని కొన్ని సార్లు దాంపత్య జీవితంలో తలెత్తే చిన్న చిన్న కారణాలు వారి జీవితంలో పెను మార్పులను తీసుకొస్తాయి. ఫలితంగా ఇరువురి మధ్య గొడవలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తాజాగా మనస్పర్థల కారణంగా విడిపోయిన జంటను తిరిగి కలిపేందుకు గ్వాలియర్ హైకోర్టు(Gwaliior High Court) కీలక తీర్పు వెల్లడించింది. భర్త నుంచి వేరుగా ఉంటున్న భార్య పిటిషన్(petition) పై విచారణ చేపట్టి సంచలన తీర్పు ఇచ్చింది. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు భర్త నెలరోజుల పాటు భార్య ఇంటికి ఇల్లరికం వెళ్లాలని ఆదేశించింది. అయినప్పటికీ తీరు మారకపోతే తర్వాత ఆలోచిస్తామని వెల్లడించింది. ఈ తీర్పు ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది.

మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని సేవానగర్ కు చెందిన గీతా రజక్, మొరాదా కు చెందిన గణేశ్ కు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు సంతానం. కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి దాంపత్యంలో ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వీరిద్దరి ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి. ఈ క్రమంలో గీత తన భర్తను వదిలి వెళ్లిపోయింది. అయితే తమ బిడ్డను ఇచ్చేందుకు గణేశ్ నిరాకరించాడు. కుమారుడు తన వద్దే పెరుగుతాడని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గీత గ్వాలియర్ హైకోర్టును ఆశ్రయించింది. తన బిడ్డను తన దగ్గరకు చేర్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.

తనను మానసికంగా హింసించి, ఇంటి నుంచి వెళ్లగొట్టారని గీతా కోర్టుకు తెలిపింది. తనను అత్తింటి వారు మానసికంగా వేధించారని, వారి వేధింపులు తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని గణేశ్ పేర్కొన్నాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. ఒక విచిత్రమైన తీర్పు వెల్లడించింది. గణేశ్ ఒక నెల రోజుల పాటు భార్య ఇంటికి ఇల్లరికం వెళ్లాలని తీర్పునిచ్చింది. అదే విధంగా అల్లుడిని బాగా చూసుకోవాలని గీతా కుటుంబసభ్యులకు సూచించింది. ఫలితంగా దంపతుల మధ్య నెలకొన్న మనస్పర్థలు తొలగిపోతాయని ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేసింది. నెల రోజుల తర్వాత కూడా ఇదే విధంగా ఉంటే తర్వాత ఆలోచిద్దామంటూ హైకోర్టు వివరించింది.

Also Read

Russia Ukraine War: పిచ్చి పట్టిందా..? పుతిన్‌ నిర్ణయంపై నాటో దేశాల ఆందోళన..

Maha Shivaratri 2022: శివరాత్రి ఉపవాసం ఉన్నవారు తినవల్సినవి..

కమెడియన్ నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడి వరకు.. జెలెన్ స్కీ ప్రస్థానం

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు