మందుపై ‘ముందు చూపు’.. దాదాపుగా లక్ష రూపాయల మద్యం కొనేశాడు.. పొటో వైరల్..!

మందుపై 'ముందు చూపు'.. దాదాపుగా లక్ష రూపాయల మద్యం కొనేశాడు.. పొటో వైరల్..!

సోమవారం నుంచి లాక్‌డౌన్‌ 3.0 ప్రారంభం కాగా.. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 05, 2020 | 11:13 AM

సోమవారం నుంచి లాక్‌డౌన్‌ 3.0 ప్రారంభం కాగా.. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలో తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు మినహాయించి.. చాలా రాష్ట్రాల్లో మందు షాపులు తెరుచుకున్నాయి. అంతే.. అసలే 45 రోజులుగా మందు లేక నాలుక చచ్చుబడి తెగ ఇబ్బంది పడిపోయిన మందుబాబులు.. మొదటి రోజే ఎగబడ్డారు. సామాజిక దూరం మాట అటుంచితే.. కరోనా భయం ఏ మాత్రం లేకుండా మందు దొరికిందన్న ఆనందంలో పలుచోట్ల డ్యాన్సులు, పూజలు కూడా చేశారు.

ఇదిలా ఉంటే బెంగళూరులో ఓ వ్యక్తి దాదాపుగా రూ.50వేల మద్యంను కొనుగోలు చేశాడు. ఇక తాజాగా బెంగళూరులోనే మరో వ్యక్తి దాదాపు రూ.లక్ష విలువ చేసే మద్యం బాటిళ్లను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన బిల్‌ పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వివిధ బ్రాండ్లకు సంబంధించిన మందులను అతడు కొనుగోలు చేశాడు. దీనిపై మిశ్రమ కామెంట్లు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో చాలామంది నిరాశ్రయులు అవ్వగా.. ఒక్క పూట కూడా బోజనం లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఆ డబ్బులను వారి కోసం ఉపయోగించొచ్చు కదా అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మందుపై ముందుచూపుతో అతడు ఇంతేసి మద్యాన్ని కొన్నాడని మరికొందరు అంటున్నారు. ఇంకొందరేమో వారి డబ్బులు వారిష్టం అంటూ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా మద్యం షాపులు తెరుచుకోవడంతో మందు బాబులకు మళ్లీ కిక్‌ వచ్చినట్లైంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కూడా భారీ ఆదాయం వస్తోంది.

Read this Story Also: ఢిల్లీలో కాల్పులు జరిపిన కానిస్టేబుల్.. ఇద్దరికి గాయాలు..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu