వంద రోజులుగా కరోనా వైరస్‌తో పోరాడుతూ చావు, బతుకులతో చెలగాటమాడుతూ ఎట్టకేలకు డిశ్చార్జి అయ్యాడు ఓ వ్యక్తి. బహుశా ఎక్కువ కాలం కొవిడ్‌తో పోరాడింది ఈయనే కావచ్చని అంటున్నాడు గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్పటేల్. ఈ సందర్భంగా ఆయనను కలుసుకొని పరామర్శించి పలకరించారు.
గుజరాత్ రాష్ర్టానికి చెందిన రవీంద్ర పర్మార్ అనే వ్యక్తి ఆగస్ట్ 26న కొవిడ్ బారిన పడ్డారు. కుటుంబ సభ్యులు అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో సోలా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాదాపుగా పర్మార్ 113 రోజులు ఐసీయూలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అవసరం ఉన్నప్పటికీ ఇంటి దగ్గర అందించడం వీలవుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రి నితిన్ పటేల్ మాట్లాడుతూ. ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ల సేవను కొనియాడారు. అంతేకాకుండా ఇదే వైద్యం ప్రైవేట్ ఆస్పత్రిలో చేస్తే రూ.30 లక్షల దాకా ఖర్చయ్యేదని అన్నారు. ఏది ఏమైనా రవీంద్ర పర్మార్ కోలుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. తన భర్త కోసం కష్టపడిన వైద్య సిబ్బందికి పర్మార్ భార్య ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.