Gujarat Elections 2022: పొడవాటి మీసాలు పెంచుకునే వారందరికీ ప్రత్యేక భత్యం.. గుజరాత్‌ ఎన్నికల్లో ఆ అభ్యర్థి హామీ ఇదే..

ఎన్నికలంటే చాలు.. మ్యానిఫెస్టోలు రూపొందింస్తూ.. వాటిలో అనేక హామీలు గుప్పిస్తారు. పార్టీలైతే రాష్ట్ర వ్యాప్తంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రజలను ఓట్లడుగుతాయి. అదే స్వాతంత్య్ర అభ్యర్థులైతే స్థానిక సమస్యలపై..

Gujarat Elections 2022: పొడవాటి మీసాలు పెంచుకునే వారందరికీ ప్రత్యేక భత్యం.. గుజరాత్‌ ఎన్నికల్లో ఆ అభ్యర్థి హామీ ఇదే..
Maganbhai Solanki
Follow us

|

Updated on: Dec 02, 2022 | 3:51 AM

ఎన్నికలంటే చాలు.. మ్యానిఫెస్టోలు రూపొందింస్తూ.. వాటిలో అనేక హామీలు గుప్పిస్తారు. పార్టీలైతే రాష్ట్ర వ్యాప్తంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రజలను ఓట్లడుగుతాయి. అదే స్వాతంత్య్ర అభ్యర్థులైతే స్థానిక సమస్యలపై మాట్లాడతారు. తాను గెలుపొందింతే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి తరపున ప్రభుత్వంతో పోరాడతానని హామీ ఇస్తారు. కొన్ని పార్టీలు, కొంత మంది అభ్యర్థులు అయితే అమలయ్యేవి, అమలు కానివి.. ఇలా ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలు మొదలు అభివృద్ధి కార్యక్రమాల వరకు ఉచిత హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. కానీ, గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం వెరైటీ హామీతో ఓట్లు అడుగుతున్నాడు. పొడవాటి మీసాలు పెంచుకునే వారందరికీ ప్రభుత్వం ప్రత్యేక భత్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ స్వాతంత్య్ర అభ్యర్థి. తాను ఎన్నికల్లో గెలిస్తే పొడవాటి మీసాలు పెంచుకునేలా యువతను ప్రోత్సహించేందుకు చట్టాన్ని తేవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెబుతున్నారు. గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాకు చెందిన మంగన్‌భాయ్‌ సోలంకి 2012లో ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందారు. ఆయనకు యుక్త వయసు నుంచే మీసాలు పెంచుకునే అలవాటు ఉంది. ఆయన మీసాల పొడవు ఇరువైపుల కలిపి సుమారు 5 అడగులు ఉంటాయి. ప్రస్తుతం గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో హిమ్మత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి రెండో విడతలో అంటే డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే మీసాలే అజెండాగా ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు.

ఆర్మీలో ఉన్నప్పుడు తన రెజిమెంట్‌లో మీసాల వ్యక్తిగా ప్రాచుర్యం పొందానని, తన మీసాలే తనకు గర్వకారణమంటున్నారు మంగన్‌భాయ్ సోలంకి. మీసాలు పెంచుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేక భత్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. తన మీసాల నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక భత్యం కూడా పొందానని మంగన్‌భాయ్‌ సోలంకి పేర్కొన్నారు.

2017లో రాజకీయాల్లోకి వచ్చిన సోలంకి తొలుత బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. మీసాలు పెంచడంపై యువతను ప్రోత్సహించడంతోపాటు రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగుల సమస్యలపైనా పోరాటం కొనసాగిస్తానని చెబుతున్నారు. మీసాలు పెంచడం తన తండ్రి నుంచి స్ఫూర్తి పొందానని చెబుతున్న సోలంకి.. ఎన్నికల్లో గెలిచే వరకూ పోటీ చేస్తూనే ఉంటానని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు