5 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి, ఒక్క ఇంజెక్షన్ కోసం రూ. 16 కోట్ల విరాళాలు సేకరించిన పేరెంట్స్

గుజరాత్ కు చెందిన దంపతులుఅరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ 5 నెలల చిన్నారిని రక్షించుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు.

  • Umakanth Rao
  • Publish Date - 3:35 pm, Wed, 5 May 21
5 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి, ఒక్క ఇంజెక్షన్ కోసం రూ. 16 కోట్ల విరాళాలు సేకరించిన పేరెంట్స్
16 Crores For 1 Injection To Save 5 Month Old Son

గుజరాత్ కు చెందిన దంపతులుఅరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ 5 నెలల చిన్నారిని రక్షించుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. వెన్నెముకకు సరిగా పటుత్వం లేకపోవడం వల్లో, జన్యు సంబంధ కారణం వల్లో ఈ బాలుడు ‘స్పైనల్ మస్క్యులర్ ఎట్రోఫీ’ అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.ఇది సోకినవారు తమ కాళ్ళు, చేతులను కదిలించలేరు..శ్వాస కూడా సరిగా తీసుకోలేరు. ఈ వ్యాధితో బాధ పడుతున్న తమబిడ్డను రక్షించుకోవడానికి రాజ్ దీప్ సింగ్ రాథోడ్, ఆయన భార్య గెనెల్డా నడుం కట్టారు. ఈ వ్యాధి చికిత్సలో వాడే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ కోసం విరాళాలను సేకరించడం ప్రారంభించారు. ఈ ఒక్క ఇంజెక్షన్ కోసం 16 కోట్లను సేకరించగలిగారు. ఇటీవల ముంబైకి వచ్చి తమ బిడ్డను ఆసుపత్రిలో చేర్పించారు. ఇండియా లోని స్విస్ ఫార్మా సంస్థ ‘ నోవార్టిస్’ ఈ ఇంజెక్షన్ ని తయారుచేస్తోందని, ప్రపంచంలో ఇదొక్కటే ఇలాంటి వ్యాధులకు సరైన మందు అని రాజ్ దీప్ తెలిపారు.దీనిపై కస్టమ్స్ సుంకం రూ. 6.5 కోట్లను కేంద్రం మాఫీ చేసిందన్నారు.జూల్ గెన్ స్మా అనే ఈ ఇంజెక్షన్ ని డాక్టర్లు తమ కుమారుడికి ఇచ్చారని, తమ బిడ్డ త్వరగా కోలుకుని ఆరోగ్యవంతుడు అవుతాడని కొండత నమ్మకంతో ఉన్నామని ఆయన చెప్పారు.
గత మార్చి నుంచి విరాళాల కోసం తాము యత్నిస్తూ వచ్చామని 42 రోజుల్లో ఈ భారీ డొనేషన్స్ ని సేకరించినట్టు ఆయన చెప్పారు. గుజరాత్ నుంచే కాక..విదేశాల నుంచి కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారా డొనేషన్స్ అందినట్టు ఆయన తెలిపారు.తమ బిడ్డ కోసం ఉదారంగా విరాళాలు ఇచ్చినవారికి, కస్టమ్స్ సుంకాన్ని మాఫీ చేసిన కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కరోనా సూపర్‌ స్ప్రెడర్స్‌గా రైతు బజార్లు.. నిబంధనలు పట్టించుకోని జనాలు.. మాస్కులు లేకుండా.!

Siddipet Municipality: సిద్ధిపేట మున్సిపాలిటీ అశావహుల కర్చీలాట.. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపికపై టీఆర్ఎస్ కుస్తీ.. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు..!