Gujarat and Himachal Pradesh Election Exit Poll Results 2022 : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. గుజరాత్‌లో బీజేపీకే అన్ని ఎగ్జిట్ పోల్స్ పట్టంకడుతుండగా.. హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ -కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి ప్రధాని మోదీ నాయకత్వం ప్రజల నమ్మకం సడలలేదంటూ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగడం, అభివృద్ధి తదితర అంశాలు బీజేపీకి కలిసివచ్చే విధంగా ఉన్నట్లు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు 30 సభల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. అభ్యర్ధులను కాదు నన్ను చూసి ఓటెయ్యండి అంటూ ప్రచారం నిర్వహించడం.. అదేవిధంగా గతం వలే మోడీ మేనియా కొనసాగడం బీజేపీకి మరింత ప్లస్‌గా పేర్కొన్నాయి.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌లో బీజేపీ వైపు ప్రజలు మొగ్గుచూపుతుండగా.. హిమాచల్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
Gujarat
Hp Polls
మరిన్ని జాతీయ వార్తల కోసం..