Tamila Nadu: భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్.. షవర్మాపై నిషేధం

భోజన ప్రియులు ఎంతో ఇష్టంగా ఆరగించే షవర్మాను తమిళనాడు(Tamil Nadu)లోని ఓ మున్సిపాలిటీలో నిషేధించారు. తమిళనాడు వెల్లూర్ జిల్లా గుడియాథంలో ఈ నిబంధన అమలులోకి వస్తుందని....

Tamila Nadu: భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్.. షవర్మాపై నిషేధం
Shawarma
Follow us

|

Updated on: May 10, 2022 | 12:35 PM

భోజన ప్రియులు ఎంతో ఇష్టంగా ఆరగించే షవర్మాను తమిళనాడు(Tamil Nadu)లోని ఓ మున్సిపాలిటీలో నిషేధించారు. తమిళనాడు వెల్లూర్ జిల్లా గుడియాథంలో ఈ నిబంధన అమలులోకి వస్తుందని మేయర్ వెల్లడించారు. కేరళలో షవర్మా తిని 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడంతో తమిళనాడు అప్రమత్తమైంది. భారతీయ వంటకాల్లో భాగం కాని షవర్మా తినకూడదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సూచించింది. అయితే.. గుడియాథం మునిసిపాలిటీ మాత్రం కౌన్సిల్ సభ్యులందరినీ సోమవారం సమావేశపరిచి షవర్మాపై నిషేధం విధించాలని నిర్ణయించింది. షవర్మాను విద్యార్థులు, యువత ఇష్టంగా తింటారు. కానీ షవర్మా వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకే గుడియాథం మున్సిపాలిటీ పరిధిలో షవర్మా అమ్మకాలను నిషేధిస్తున్నామని మేయర్ సౌందర రాజన్ వివరించారు.

గుడియాథం మున్సిపాలిటీ ఈ తీర్మానం చేయడానికి ముందే షవర్మాపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షవర్మా విదేశీ వంటకం కావడం వల్ల ఆయా దేశాల్లో తక్కువ ఉష్ణోగ్రతల్లోనూ షవర్మా పాడవదని, కానీ మన దేశంలో సరైన విధంగా నిల్వ చేయకపోతే సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు.

కేరళలోని కాసర్ గోడ్ లో షవర్మా తిని.. 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఓ షాప్‌లో షవర్మా తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఆ షాపు ట్యూషన్‌ కేంద్రానికి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. కరివళ్లూర్‌కు చెందిన దేవానంద (16) కన్హాన్‌గడ్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి