కాటేసిన ‘కరోనా’, జీఎస్టీ వసూళ్లకు భారీ దెబ్బ ! తగ్గిన రూ. 2.35 లక్షల కోట్లు !

అనుకున్నంతా అయింది. కరోనా వైరస్ పాండమిక్ జీఎస్టీ వసూళ్లను తీవ్రంగా దెబ్బ తీసింది. 2021 ఆర్ధిక సంవత్సరానికి రూ. 2.35 లక్షల కోట్ల రెవెన్యూ తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది. 2020 (మార్చి) నెలకు గాను..

కాటేసిన 'కరోనా', జీఎస్టీ వసూళ్లకు భారీ దెబ్బ ! తగ్గిన రూ. 2.35 లక్షల కోట్లు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 27, 2020 | 5:42 PM

అనుకున్నంతా అయింది. కరోనా వైరస్ పాండమిక్ జీఎస్టీ వసూళ్లను తీవ్రంగా దెబ్బ తీసింది. 2021 ఆర్ధిక సంవత్సరానికి రూ. 2.35 లక్షల కోట్ల రెవెన్యూ తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది. 2020 (మార్చి) నెలకు గాను కేంద్రం రాష్ట్రాలకు రూ. 1.65 లక్షల కోట్లను జీఎస్టీ పరిహారంగా అందజేసిందని, ఇందులో రూ. 13,806 కోట్లు కూడా ఉన్నాయని జీఎస్టీకౌన్సిల్ సమావేశం అనంతరం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ కాంపెన్సేషన్ కి వసూలు చేసిన సెస్ రూ. 95,444 కోట్లని, రాష్ట్రాలకు రూ. 1.65 లక్షల కోట్లను చెల్లించామని ఆమె వివరించారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక లోటుతో అల్లాడుతున్నామని,తమకు  పరిహారం చెల్లించి ‘ఆదుకోవాలని’ రాష్ట్రాల నుంచి వఛ్చిన వత్తిడి నేపథ్యంలో గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. మాకు  జీఎస్టీ బకాయిలు చెల్లించే బాధ్యత కేంద్రంపై ఉందని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాలు కూడా ఆంటున్నాయి.

అయితే పన్ను వసూళ్లు తగ్గిన కారణంగా తమకు ఇలాంటి బాధ్యత లేదని కేంద్రం తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం తప్పనిసరిగా పరిహారం చెల్లించాల్సిందే అని ప్రభుత్వ లాయర్, అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సైతం పేర్కొన్నారు. బీజేపీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ కూడా కేంద్రం రుణాలు తెఛ్చి రాష్ట్రాలకు జీఎస్టీ కాంపెన్సేషన్ చెల్లించాలని, ఇది దాని నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు.