Amar Jawan Jyoti: అమర జవాన్ జ్యోతి విలీనం.. తప్పుబట్టిన కాంగ్రెస్..

ఢిల్లీలోని ‘ఇండియా గేట్‌’ వద్ద 50 ఏళ్లుగా ఏకధాటిగా వెలిగిన అమర జవాన్‌ జ్యోతి.. జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్వాలలో విలీనం అయింది.

Amar Jawan Jyoti: అమర జవాన్ జ్యోతి విలీనం.. తప్పుబట్టిన కాంగ్రెస్..
Jawan (1)
Follow us

|

Updated on: Jan 22, 2022 | 4:01 PM

ఢిల్లీలోని ‘ఇండియా గేట్‌’ వద్ద 50 ఏళ్లుగా ఏకధాటిగా వెలిగిన అమర జవాన్‌ జ్యోతి.. జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్వాలలో విలీనం అయింది. నిర్వహణ కష్టతరం కావడం వల్ల వీటిని కలపాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అధిపతి ఎయిర్‌ మార్షల్‌ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలో అమర జవాను జ్యోతిని.. 400 మీటర్ల దూరంలోని జాతీయ యుద్ధ స్మారకంలో కలిపారు.

1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో అసువులుబాసిన సైనికులకు గుర్తుగా అమర జవాను జ్యోతిని ఏర్పాటు చేశారు. 1972 జనవరి 26న నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దీన్ని ప్రారంభించారు. జాతీయ యుద్ధస్మారకాన్ని 2019 ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన 25,942 మంది సైనికుల పేర్లను ఇక్కడి గ్రానైట్‌ ఫలకాలపై బంగారు అక్షరాల్లో చెక్కారు.

జ్యోతి విలీనంపై మాజీ సైనికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ సైన్యాధ్యక్షుడు వేద్‌ ప్రకాశ్‌ మాలిక్‌ సమర్థించారు. జాతీయ యుద్ధ స్మారకం ఏర్పాటయ్యాక అమర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయని పేర్కొన్నారు. వైమానిక దళ మాజీ ఉన్నతాధికారి మన్మోహన్‌ బహదూర్‌ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇండియా గేట్‌ వద్ద అమరజ్యోతి.. భారతీయుల మనస్సులో బలమైన ముద్ర వేసిందన్నారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మోదీని కోరారు. జాతీయ యుద్ధ స్మారకం గొప్పదే అయినా.. అమర్‌జవాన్‌ జ్యోతితో ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోవని స్పష్టం చేశారు.

1947-48 పాకిస్థాన్‌ యుద్ధం మొదలుకొని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల వరకు అందరి పేర్లు జాతీయ యుద్ధ స్మారకంలో ఉన్నాయని గుర్తుచేశాయి. ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌ మండిపడింది. కొందరు దేశభక్తిని, త్యాగాన్ని అర్థం చేసుకోలేరంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. శౌర్యపరాక్రమాలు చాటిన జవాన్ల స్మారకార్థం వెలిగిన జ్యోతి ఈ రోజు లేకపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అమర్‌ జవాన్‌ జ్యోతిని మళ్లీ వెలిగిస్తామని చెప్పారు.

అయితే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్ధించుకుంది. ఇది అర్పివేయడం కాదు విలీనమని తెలిపింది. ఇందిరా గాంధీ ప్రారంభించిన అమర జవాన్ జ్యోతిని విలీనం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇది చరిత్ర కించపరడమే అని అంటున్నారు. ఇందిరా గాంధీ కిర్తీని మసకబరించేదుకే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు.

Read Also.. మహిళలకు ముఖ్య గమనిక.. ఈ 11 హక్కులు మీ కోసమే ఉన్నాయని తెలుసా..?

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..