‘పెగాసస్’ స్పై వేర్ తో నిఘా.. ప్రశాంత్ కిషోర్ తో నా సమావేశాలపై ప్రభుత్వ డేగకన్ను.. మమతా బెనర్జీ ఫైర్

పెగాసస్ స్పై వేర్ ని వినియోగించి ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులపై నిఘా పెడుతోందని ఆరోపణలు వస్తున్న వేళ..బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ..

  • Publish Date - 6:12 pm, Thu, 22 July 21 Edited By: Phani CH
'పెగాసస్' స్పై వేర్ తో నిఘా.. ప్రశాంత్ కిషోర్ తో నా సమావేశాలపై ప్రభుత్వ డేగకన్ను.. మమతా బెనర్జీ ఫైర్
Mamata Banerjee

పెగాసస్ స్పై వేర్ ని వినియోగించి ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులపై నిఘా పెడుతోందని ఆరోపణలు వస్తున్న వేళ..బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తాను జరిపిన సమావేశాలను ఈ స్పై వేర్ ని వినియోగించే ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆమె ఆరోపించారు. పీకేతోను, మరికొందరి తోను కొన్ని రోజుల క్రితం తాను నిర్వహించిన మీటింగులపై నిఘా ఉందని.. ప్రశాంత్ కిషోర్ తన ఫోన్ ని ‘ఆడిట్’ చేయించగా వీటిలో ఒకటి పెగాసస్ ద్వారా వారికి (ప్రభుత్వానికి) తెలిసినట్టు ఆయన గుర్తించారని ఆమె చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇది నిజంగా సర్కార్.. విపక్ష నేతల కార్యకలాపాలపై నిఘా పెట్టినట్టే తెలుస్తోందన్నారు. ఇండియాలో ఇద్దరు మంత్రులు, 40 మంది జర్నలిస్టులు, ముగ్గురు ప్రతిపక్ష నేతలతో సహా 300 మంది ప్రముఖుల ఫోన్ నెంబర్లు హ్యాకింగ్ కి గురయినట్టు వచ్చిన వార్తలు ఇటీవల దేశంలో పెద్ద దుమారాన్ని రేపాయి.

పార్లమెంటులో విపక్ష నేతలు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే ఈ స్పై వేర్ ని వినియోగించి ప్రభుత్వం ఎవరిమీదా గూఢచర్యం నెరపడం లేదని సంబంధిత మంత్రి తోసిపుచ్చారు. భారత ప్రజాస్వామ్యాన్ని దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. నిజానికి ఈ గూఢచర్యంతో ప్రభుత్వానికి సంబంరంధం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. గత మూడు రోజులుగా పెగాసస్ అంశమే పార్లమెంట్ ఉభయ సభలను కుదిపివేస్తోంది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేతగానీ, సుప్రీంకోర్టు చేత గానీ విచారణ జరిపించాలని శివసేన నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:  Viral Video: ఈ ఐస్‌క్రీమ్‌ చాలా కాస్లీ గురూ..!! దీని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?? వీడియో

పెళ్లిలో వరుడి చిలిపి పని..!! ఒక్కసారిగా వధువుతో సహా అందరు షాక్‌..!! వీడియో