లాక్ డౌన్ ముగిశాక.. విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు

విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపునకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలు సైతం దీనిపై దృష్టి సారించడం ప్రారంభించాయి...

లాక్ డౌన్ ముగిశాక.. విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 26, 2020 | 8:24 PM

విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపునకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలు సైతం దీనిపై దృష్టి సారించడం ప్రారంభించాయి. అయితే లాక్ డౌన్ ముగిశాకే ఈ తరలింపునకు శ్రీకారం చుట్టనున్నారు. విమాన సర్వీసులను పునరుధ్ధరించిన అనంతరం ప్రత్యేక విమానాల ద్వారానో, రెగ్యులర్ విమానాల ద్వారానో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిస్థితులను బట్టి ఈ తరలింపు ఉంటుందని తెలుస్తోంది. కానీ ఆయా దేశాల్లోని భారతీయులు టికెట్ల కోసం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా  గల్ఫ్ దేశాల్లో వేలాది భారతీయులు చిక్కుబడి ఉన్న విషయం విదితమే.