మీకు పౌరసత్వం వర్తిస్తుందా.. చట్టం ఏం చెబుతోంది.? ప్రభుత్వ వివరణ

దేశంలో అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు పలువురు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా ఈ చట్టంపై నిరసనలు మిన్నంటాయి. లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమని.. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును కూడా ఈ చట్టం ఉల్లంఘిస్తోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి కీలక వివరణను […]

  • Updated On - 6:09 pm, Sun, 22 December 19 Edited By:
మీకు పౌరసత్వం వర్తిస్తుందా.. చట్టం ఏం చెబుతోంది.? ప్రభుత్వ వివరణ

దేశంలో అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు పలువురు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా ఈ చట్టంపై నిరసనలు మిన్నంటాయి. లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమని.. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును కూడా ఈ చట్టం ఉల్లంఘిస్తోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి కీలక వివరణను వెల్లడించింది.

1987 లేదా అంతకముందు ఇండియాలో జన్మించిన వ్యక్తులు, అంతేకాకుండా వారి తల్లిదండ్రులైనా 1987లో జన్మించినట్లయితే.. వాళ్ళందరూ భారతీయులేనని.. కొత్తగా వచ్చిన ఈ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్సీ‌ల విషయం గురించి పట్టించుకోనక్కర్లేదని కేంద్ర అధికారి ఒకరు స్పష్టం చేశారు.

అంతేకాకుండా 2004 పౌరసత్వ చట్ట సవరణల ప్రకారం చూస్తే.. దేశ ప్రజలు, అస్సాంలో ఉన్నవారిని మినహాయిస్తే.. పౌరుల తల్లిదండ్రులు భారతీయులైనా, లేక అక్రమ వలసదారులైన వాళ్లకు భారత పౌరసత్వం వర్తిస్తుందని తెలుస్తోంది. ఇక పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు మిన్నంటిన వేళ కేంద్రం నుంచి ఈ వివరణ రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ చట్టంపై అనేక వెర్షన్స్ ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఈ వివరణపై చర్చలు మొదలయ్యాయి.

1987కు ముందు భారతదేశంలో జన్మించిన వారు లేదా ఆ సంవత్సరానికి ముందు వారి తల్లిదండ్రులు దేశంలో జన్మించి ఉంటే.. వారందరూ కూడా చట్టం పరిధిలోకి వస్తారు. అయితే అస్సాం విషయంలో మాత్రం భారతీయ వారసత్వాన్ని గుర్తించడానికి కట్ ఆఫ్ డేట్ 1971వ సంవత్సరంగా నిర్ధారిస్తామని సదరు అధికారి తెలిపారు.