జర్నలిస్ట్ తరుణ్ తేజ్ పాల్ కేసు దర్యాప్తులో లోపాలు, గోవా కోర్టు స్పష్టీకరణ, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా ?

తెహెల్కా న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కేసు దర్యాప్తులో పలు లోపాలు ఉన్నాయని గోవా కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై ఫిర్యాదు చేసిన మహిళ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.

జర్నలిస్ట్ తరుణ్ తేజ్ పాల్ కేసు దర్యాప్తులో లోపాలు, గోవా కోర్టు స్పష్టీకరణ,  మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా ?
Tarun Tejpal
Follow us

| Edited By: Phani CH

Updated on: May 26, 2021 | 9:45 AM

తెహెల్కా న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కేసు దర్యాప్తులో పలు లోపాలు ఉన్నాయని గోవా కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై ఫిర్యాదు చేసిన మహిళ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. ఈ నెల 21 న తరుణ్ తేజ్ పాల్ ను నిర్దోషిగా కోర్టు విడిచిపుచింది. తన 500 పేజీల తీర్పులో జడ్జి ఈమేరకు ఉత్తర్వులిస్తూనే ఎనిమిదేళ్ల నాటి ఈ కేసులో కీలకమైన అంశాలపై దర్యాప్తు అధికారి సునీతా సావంత్ సరైన ఇన్వెస్టిగేషన్ జరపలేదని స్పష్టం చేశారు. బాధితురాలి మనోక్షోభ నిజమేనని, అయితే ఇదే సమయంలో నిందితుడు కూడా ఎంతో అవమానం, అతని ప్రతిష్టకు భంగం కలిగినట్టు భావించాల్సి వస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ను వ్యక్తం చేశారు. తరుణ్ తేజ్ పాల్ తనను లోబరచుకోవడానికి ప్రయత్నించాడన్న బాధితురాలి ఆరోపణపై జడ్జి స్పందిస్తూ కొన్ని వాట్సాప్ సందేశాలు చూస్తే.. ఆమె సంఘటన జరిగిన తరువాత కూడా గోవాలోనే ఉందన్న విషయం స్పష్గమవుతోందని, పైగా ఆమె చేసిన ప్రకటనలు పరస్పర విరుద్జంగా, గందరగోళంగా ఉన్నాయని అన్నారు. ఆమె తల్లి చెబుతున్నదానికి , ఈ వ్యాఖ్యలకు పొంతన లేదన్నారు.

నేరం జరిగినట్టు చెబుతున్న హోటల్ మొదటి అంతస్తులోని సీసీటీవీ ఫుటేజీని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డ్యామేజీ చేశారని, ఇది నిందితుని నిజాయితీని నిరూపిస్తోందన్నారు. ఏమైనా ఈ ఇన్వెస్టిగేషన్ లో చాలా లోపాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కేసులో తరుణ తేజ్ పాల్ ను అన్ని అభియోగాల నుంచి కోర్టు విముక్తుడిని చేసింది. చూడబోతే మళ్ళీ దీనిపై దర్యాప్తు జరుగుతుందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: సేద తీరుతున్న చిరుత.. అంతలో మొసలి ఎటాక్.. షాకింగ్ వీడియో వైరల్.!

Viral Video: తన ఓనర్ కార్ పార్కింగ్ చేసిన కుక్క…చూస్తే పక్కా షాక్ అవుతారు..! ( వీడియో )

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్