మనీ లాండరింగ్ కేసులో నీరవ్ మోడీ భార్యకోసం ‘రెడ్ కార్నర్’ నోటీసు జారీ

మనీ లాండరింగ్ కేసులో డైమండ్ మర్చంట్ నీరవ్ మోడీ భార్య అమీ మోడీ కూడా చిక్కుకుంది. ఇండియాలో ఆమెపై దాఖలైన ఈ కేసుకు సంబంధించి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. గత ఏడాది ఈమె చివరిసారి అమెరికాలో..

  • Umakanth Rao
  • Publish Date - 6:14 pm, Tue, 25 August 20
మనీ లాండరింగ్ కేసులో నీరవ్ మోడీ భార్యకోసం 'రెడ్ కార్నర్' నోటీసు జారీ

మనీ లాండరింగ్ కేసులో డైమండ్ మర్చంట్ నీరవ్ మోడీ భార్య అమీ మోడీ కూడా చిక్కుకుంది. ఇండియాలో ఆమెపై దాఖలైన ఈ కేసుకు సంబంధించి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. గత ఏడాది ఈమె చివరిసారి అమెరికాలో కనిపించింది. ఆ తరువాత ఈమె జాడ అజాపజా లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు  వేల కోట్ల  కుచ్చు టోపీ పెట్టి లండన్ చెక్కేసిన నీరవ్ మోడీ ప్రస్తుతం బ్రిటన్ లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఆ దేశాన్ని కోరుతోంది. అటు- న్యూయార్క్ సిటీలో 30 మిలియన్ డాలర్ల వ్యయంతో రెండు అపార్ట్ మెంట్ల కొనుగోలులో  అవినీతి జరిగిందన్నది ఓ ఆరోపణ.. ఈ  దందాలో అమీ మోడీ కూడా అనుచిత లబ్ది పొందిందని 2019 ఫిబ్రవరిలో ఈడీ పేర్కొంటూ.. తన అనుబంధ ఛార్జి షీట్లో ఆమెను నిందితురాలిగా  చేర్చింది.

ఇవి నీరవ్ మోడీకి సంబంధించిన 637 కోట్ల విలువైన విదేశీ ఆస్తుల్లో భాగమని, ఇందులో లండన్లో 56. 97 కోట్ల విలువైన ఫ్లాట్ కూడా ఉందని తెలుస్తోంది. అయితే అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. నీరవ్ మోడీ సోదరుడు నెహాల్ , సోదరి పుర్వీ కి సంబందించి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. వేల కోట్ల స్కామ్ లో నీరవ్ అంకుల్ మెహూల్ చోక్సీ కూడా నిందితుడన్న విషయం విదితమే.