ఫలించిన పోరాటం… అతడికి సీటు కేటాయించండి… ఐఐటీ బొంబాయి విశ్వవిద్యాలయానికి సుప్రీం కోర్టు సూచన…

సిద్ధాంత్ బాత్రా అనే విద్యార్థి పోరాటం ఫలించింది. తనకు సీటు కేటాయించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆ విద్యార్థికి న్యాయమే జరిగింది. ఐఐటీ బొంబాయి విశ్వవిద్యాలయం సదరు విద్యార్థికి సీటు కేటాయించాలని ధర్మాసనం సూచించింది.

ఫలించిన పోరాటం... అతడికి సీటు కేటాయించండి... ఐఐటీ బొంబాయి విశ్వవిద్యాలయానికి సుప్రీం కోర్టు సూచన...
Follow us

| Edited By:

Updated on: Dec 09, 2020 | 7:21 PM

Give interim admission to boy who lost seat after ‘wrong’ click: SC to IIT Bombay  సిద్ధాంత్ బాత్రా అనే విద్యార్థి పోరాటం ఫలించింది. తనకు సీటు కేటాయించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆ విద్యార్థికి న్యాయమే జరిగింది. ఐఐటీ బొంబాయి విశ్వవిద్యాలయం సదరు విద్యార్థికి సీటు కేటాయించాలని ధర్మాసనం సూచించింది.

అసలు సమస్య ఇదే…

ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బాత్రా, ఐఐటి-జెఈఈ (అడ్వాన్స్‌డ్) 2020 ను ర్యాంకు సాధించి, అక్టోబర్ 18 న రౌండ్ వన్‌లో ముందుకెళ్లాడు. అక్టోబర్ 31 న, అతను తన రోల్ నంబర్‌పై అప్ డేట్స్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సీటు ఉపసంహరణ బటన్‌పై అనుకోకుండా క్లిక్ చేశాడు. తీరా చూస్తే.. నవంబర్ 10 న ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాలో అతని పేరు లేదు. అతడు సీటు సాధించిన రెండు వారాల్లోనే దాన్ని కోల్పోయాడు.

ఉపసంహరణ లేఖకు వ్యతిరేకంగా పోరాడటానికి బొంబాయి హైకోర్టును ఆశ్రయించాడు. నవంబర్ 19 న ధర్మాసనం తన పిటిషన్‌ను 2 రోజుల్లోపు రిప్రజెంటేషన్‌గా పరిగణించాలని ఐఐటికి ఆదేశించింది. అయితే ఐఐటి రిజిస్ట్రార్ ఆర్ ప్రేమ్‌కుమార్ ఉపసంహరణ లేఖను రద్దు చేసే అధికారం తమకు లేదని పేర్కొన్నారు. దీంతో తన కోసం అదనపు సీటును కేటాయించాలని బాత్రా సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు అతడికి సీటు కేటాయించాలని ఐఐటీ బొంబాయి అధికారులకు సూచించింది.