Superstition: వర్షం కోసం దారుణం.. బాలికలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు.. ఎక్కడంటే..?

Girls Paraded Naked For Rain: ముఢనమ్మకాలు, వింత ఆచారాలు పాటించడంపై అవగాహనలు కల్పించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. కొంతమంది వాటినే అలానే అచరిస్తూ సభ్యసమాజం తలదించుకునేలా

Superstition: వర్షం కోసం దారుణం.. బాలికలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు.. ఎక్కడంటే..?
Girls Paraded Naked For Rain
Follow us

|

Updated on: Sep 07, 2021 | 9:15 AM

Girls Paraded Naked For Rain: ముఢనమ్మకాలు, వింత ఆచారాలు పాటించడంపై అవగాహనలు కల్పించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. కొంతమంది వాటినే అలానే అచరిస్తూ సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా వర్షాల కోసం ఓ గ్రామస్థులు బాలికలను నగ్నంగా ఊరేగించారు. ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారింది. ఈ షాకింగ్‌ సంఘటన మధ్యప్రదేశ్‌ దామోహ్‌ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఆ గ్రామస్థులు వర్షాల కోసం ఆరుగురు ఆదివాసీ బాలికలను నగ్నంగా ఇంటింటికి నడిపించారు. వారితో బరువైన రోలు మోయించారు. దీంతోపాటు భజనలు చేయిస్తూ బాలికలతో భిక్షమెత్తించారు. ఈ సంఘటన బనియా గ్రామంలో ఆదివారం జరిగింది.

ఇలా సేకరించిన ఆహార పదార్థాలతో గ్రామ దేవాలయం ఎదుట అన్నదానం చేసి.. పూజలు చేస్తే వర్షం కురుస్తుందని ఆ గ్రామస్థుల మూఢనమ్మకం. ఈ దారుణ సంఘటన వెలుగులోకి రావడంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి.. విచారణ చేపట్టింది. దీంతోపాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సోమవారం దామోహ్ కలెక్టర్‌కు లేఖ రాసింది. దీనిపై పది రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. అంతకుముందు ఈ విషయంపై దామోహ్ ఎస్పీ తెనివర్ స్పందించారు. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం కారణంగా, గ్రామస్థులు పిల్లల అనుమతితోనే.. ఏటా ఈ విధంగా ఊరేగింపులు నిర్వహిస్తారని తెలిపారు. ఎవరైనా వారితో బలవంతంగా ఇలా చేయించారా.. లేదా అనేది విచారిస్తున్నామని తెలిపారు. ఒకవేళ వారితో బలవంతంగా చేయించారని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

Also Read:

Crime News: తల్లి ఆడిస్తుండగా చిన్నారిని కాటేసిన తాచుపాము.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే..

Rahul Gandhi: రాహుల్‌ గాంధీనే పార్టీ చీఫ్‌గా నియమించాలి.. యూత్‌ కాంగ్రెస్‌ తీర్మానం..