General Rawat helicopter crash: బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంపై నివేదిక.. పైలెట్ చివరిసారిగా చెప్పిన మాటలు ఇవే..

General Rawat helicopter crash: బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంపై నివేదిక.. పైలెట్ చివరిసారిగా చెప్పిన మాటలు ఇవే..
General Rawat Helicopter Cr

సీడీసీ బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంపై విచారణ ముగిసింది. అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తమ విచారణ నివేదికను సమర్పించింది. గతేడాది డిసెంబర్‌ 8న తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో..

Sanjay Kasula

|

Jan 05, 2022 | 12:24 PM

General Rawat Helicopter Crash Report: అది ప్రమాదం.. సీడీసీ బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంపై విచారణ ముగిసింది. అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తమ విచారణ నివేదికను సమర్పించింది. గతేడాది డిసెంబర్‌ 8న తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో జరిగిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై ట్రై-సర్వీసెస్‌ విచారణ పూర్తి చేసింది. విచారణలో వెల్లడైన వివరాలతోకూడాన నివేదికను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సమర్పించారు అధికారులు. హెలికాప్టర్ కూలిపోవడానికి ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. సూలూరు నుంచి వెల్లింగ్‌టన్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌లో చిఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక, మరో 12 మంది సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు.

విచారణ బృందం అందించిన నివేదిక ప్రకారం  Mi-17V5 ఛాపర్‌కు పైలట్‌గా ఉన్న వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, ప్రమాదానికి 8 నిమిషాల ముందు హెలికాప్టర్‌ను ల్యాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అతను హెలికాప్టర్‌ను తక్కువ ఎత్తులోకి చేరుకుందని పైలట్ వెల్లడించించాడు. భూ ఉపరితలం నుండి 500-600 మీటర్ల ఎత్తులో ఉందని తెలిపాడు. అయితే అప్పటికే హెలికాప్టర్‌ను మేఘాలు కమ్మేయడం వల్ల దారి కనిపించలేదని తెలిపినట్లుగా తెలుస్తోంది.

వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ రైల్వే లైన్‌ను అనుసరిస్తూ హెలికాప్టర్‌ను పైలట్ చేస్తున్నాడని.. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో జనరల్ రావత్ ఉపన్యాసం ఇవ్వవలసి ఉందని నివేదిక పేర్కొంది. క్రాష్‌కు 8 నిమిషాల ముందు చివరి కమ్యూనికేషన్ రికార్డ్ చేయబడింది.హెలికాప్టర్ కూలిపోవడానికి ఎలాంటి ఇతర కారణాలు లేవని నివేదికలో వెల్లడించింది.

బిపిన్ రావత్ చివరిసారి చెప్పిన మాటలు ఇవే..

డిసెంబర్ 7న ఈ వీడియోను రికార్డ్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్ తర్వాత కొద్ది గంటలకే, డిసెంబర్ 8న ప్రాణాలు కోల్పోయారు బిపిన్ రావత్. నేను ధైర్యవంతులను స్మరించుకుంటాను. వారి త్యాగాలకు నా నివాళులర్పిస్తాను..’అంటూ తన చిట్టచివరి సందేశంలో చెప్పారు CDS రావత్.

ఇవి కూడా చదవండి: అదిరిపోయే బంపర్ ఆఫర్.. FDలో కంటే ఎక్కువ లాభం.. రిచ్ లోన్ NCDలలో 11 శాతం రాబడి..

Bulli Bai Case: బుల్లీ బాయ్‌ యాప్ వెనకున్న సూత్రధారి ఈమెనా? ఇంకెవరైనా ఉన్నారా..?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu