ఆచారాలను భ్రష్టు పట్టించావు.. ‘గే’ పెళ్లిపై కుల పెద్దల ఆగ్రహం

ప్రపంచంలోని పలు దేశాల్లో స్వలింగ జంటల పెళ్లిళ్లకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని కొడవ సామాజిక వర్గానికి చెందిన

ఆచారాలను భ్రష్టు పట్టించావు.. 'గే' పెళ్లిపై కుల పెద్దల ఆగ్రహం
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2020 | 4:34 PM

Gay marriage US: ప్రపంచంలోని పలు దేశాల్లో స్వలింగ జంటల పెళ్లిళ్లకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని కొడవ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో ఇటీవల వివాహం చేసుకున్నారు. దానికి సంబంధించి ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కుల పెద్దలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆచారాలను భ్రష్టు పట్టించావు కదా అంటూ అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కొడవ సామాజిక వర్గానికి చెందిన శరత్‌ పొన్నప్ప అనే వ్యక్తి కాలిఫోర్నియాలో డాక్టర్‌గా పనిచేస్తున్న సందీప్‌ దోసాంజిని గత నెల 26న వివాహం చేసుకున్నారు. కొడవ సంప్రదాయంలో కొందరు మిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ ఫొటోలు వైరల్‌గా మారగా.. ఈ  పెళ్లిని ఖండిస్తున్నామని మడికెరి కొడవ సమాజ ప్రెసిడెంట్‌ కేఎస్‌ దేవయ్య అన్నారు. తమ కులానికి శరత్‌ మచ్చ తెచ్చాడని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటివి సహించబోమని స్పష్టం చేశారు.

గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరలేదని, వారి పెళ్లితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే వారిద్దరు కొడవ వేషాధరణలో వివాహం చేసుకోడం కలచివేస్తోందని అన్నారు. తమ సంప్రదాయాలను అవమాన పరచొద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా ఈ విషయంపై మాట్లాడేందుకు దుబాయ్‌లో నివాసం ఉంటున్న అతడి తల్లిదండ్రులు నిరాకరించారు. కాగా కొడవ కులస్తులు సాధారణంగానే తమ వేషధారణను ఎవరైనా అనుకరించి, అవమానిస్తే సహించరు. ఈ క్రమంలోనే గతేడాది కొడగు జిల్లాలోని ఓ ఫైవ్‌స్టార్ రిసార్ట్‌లో కొడవ వేషధారణలో అక్కడి వారు సేవలు అందించగా.. వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో రిసార్ట్ యాజమాన్యం క్షమాపణలు చెప్పారు.

Read More:

ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలన్నింటిలో ఆరోగ్యమిత్రలను నియమించాలి

అలియా కోరిక ఓకే.. కానీ రాజమౌళి ఒప్పుకుంటారా..!