Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీ బీజేపీలో చేరుతారా..? మార్చి 7న క్లారిటీ రానుందా.? బీజేపీ వర్గాలు ఏమంటున్నాయంటే..

Sourav Ganguly Will Join PM Rally: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పొలిటికల్‌ ఎంట్రీపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గంగూలీ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అధ్యక్షుడిగా..

Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీ బీజేపీలో చేరుతారా..? మార్చి 7న క్లారిటీ రానుందా.? బీజేపీ వర్గాలు ఏమంటున్నాయంటే..
sourav ganguly
Follow us

|

Updated on: Mar 03, 2021 | 10:45 AM

Sourav Ganguly Will Join PM Rally: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పొలిటికల్‌ ఎంట్రీపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గంగూలీ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అధ్యక్షుడిగా నియమితుడైన నాటి నుంచి దాదా బీజేపీలోకి వెళ్లనున్నాడని వార్తలు ఊపందుకున్నాయి. ఇక తాజాగా త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోనూ ఎలక్షన్స్‌ జరుగుతోన్న నేపథ్యంలో మళ్లీ గంగూలీ రాజకీయ ఎంట్రీపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో మార్చి 7న  ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో గంగూలీ పొలిటికల్‌ ఎంట్రీకి ఈ ర్యాలీనే కేంద్ర బిందువు కానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మార్చి 7పై పడింది. ఇదిలా ఉంటే గంగులీ ర్యాలీలో పాల్గొనే అంశంపై బీజేపీ అధికార ప్రతినిధి షామిక్‌ భట్టాచార్య మాట్లాడుతూ.. గంగూలీ తన ఆరోగ్య పరిస్థితిని బట్టి ర్యాలీకి హాజరుకావాలని భావిస్తే ఆయనకు స్వాగతం పలుకుతామని చెప్పుకొచ్చారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా గంగూలీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని, ఒకవేళ తాను ర్యాలీకి వచ్చే ఆలోచనతో ఉంటే మేము సాదర స్వాగతం పలుకుతామని ఆయన తెలిపారు. గతంలో గంగూలీ బీజేపీలోకి వస్తారన్న వార్తలు ఊపందుకున్న సమయంలోనే.. దాదా అనారోగ్యానికి గురయ్యారు. రెండు సార్లు ఆంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. దాదాకు ప్రస్తుతం ఉన్న స్టెంట్లకు అదనంగా మరో రెండు స్టెంట్లు వేశారు వైద్యులు. కాగా ఇటీవల గంగూలీకి పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన మళ్లీ చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అహ్మదాబాద్‌లో ప్రారంభించిన మోతేరా స్టేడియం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఆయన మరోసారి బీజేపీలో చేరుతారన్న వార్తలు గుప్పుమన్నాయి. మరి గంగూలీ పొలిటికల్‌ ఎంట్రీపై ప్రధాని ర్యాలీ రోజునైనా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.

Also Read: Jyothi Surekha: సరికొత్త జాతీయ రికార్డును సొంతం చేసుకున్న తెలుగు తేజం.. ఆర్చరీ వరల్డ్‌ కప్‌ కోసం..

Jasprit Bumrah: పెళ్లి కళ వచ్చేసింది..! అందుకే మ్యాచ్‌లకు దూరం.. పూర్తి వివరాలు ఇవే

IPL: ‘ఐపీఎల్‌లో కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు’.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టార్‌ ప్లేయర్‌..

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?